March 22, 202504:57:28 AM

Allu Ayaan: అల్లు అర్జున్ కొడుకు అయాన్ ప్రభాస్ ఫ్యానా.. వీడియో వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవల ‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అతని పార్ట్ ని రెండు ఎపిసోడ్లుగా విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం మొదటి ఎపిసోడ్ విడుదల చేయగా, తాజాగా రెండో ఎపిసోడ్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి విడుదలైన అల్లు అర్జున్ పిల్లల ప్రోమో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందులో అల్లు అర్హ అనర్గళంగా తెలుగులో ఒక పద్యం చెప్పడం..

Allu Ayaan

దానికి బాలయ్య  (Nandamuri Balakrishna)  ఫిదా అయిపోవడం అందరికీ తెలిసిన సంగతే..! సెకండ్ క్లాస్ చదువుతున్న పాప అంత పెద్ద డైలాగ్ చెప్పడం ఏంటని.. అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు అయాన్ (Allu Ayaan) వంతు వచ్చింది. అవును లేటెస్ట్ ఎపిసోడ్ లో అయాన్ హైలెట్ అయ్యాడు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అని బాలకృష్ణ.. అయాన్ ని ప్రశ్నించాడు. అందుకు అయాన్.. ‘యాక్షన్లో ప్రభాస్ (Prabhas) , డాన్సింగ్లో చిరు తాత.. ఓవరాల్ గా ప్రభాస్’ అంటూ చెప్పుకొచ్చాడు.

అందుకు బాలయ్య.. ‘మీ డాడీకి బెస్ట్ ఫ్రెండ్ అని.. ప్రభాస్ పేరు చెబుతున్నావా?’ అంటూ ప్రశ్నించాడు. దానికి అయాన్ (Allu Ayaan) ..’కాదు.. నాకు బాహుబలి (Baahubali) అంటే చాలా ఇష్టం. అది చూసినప్పటి నుండి ప్రభాస్ కి ఫ్యాన్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు. సో అలా అల్లు అర్జున్ కొడుకు ప్రభాస్ ఫ్యాన్ అయ్యాడన్న మాట.

కానీ గతంలో కూడా అయాన్ తనకి ఇష్టమైన హీరో మహేష్ బాబు (Mahesh Babu) అని చెప్పాడు. ‘శ్రీమంతుడు’ (Srimanthudu) చూశాక మహేష్ బాబు ఫ్యాన్ అయినట్లు తెలిపాడు. ఇప్పుడేమో ప్రభాస్ కి ఫ్యాన్ అయినట్టు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా అయాన్ లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది.

‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.