March 24, 202508:09:23 AM

Amaran: ‘అమరన్’ టీంకి లీగల్ నోటీసులు.. ఏమైందంటే..!

‘అమరన్’ (Amaran) సినిమా ఇటీవల అంటే దీపావళి కానుకగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో 2024 కి గాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘అమరన్’ సినిమా. శివ కార్తికేయన్ (Sivakarthikeyan), సాయిపల్లవి  (Sai Pallavi) ..ల పెర్ఫార్మన్స్..లకి క్రిటిక్స్ నుండి ప్రశంసలు కురిశాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రూపొందింది ఈ సినిమా. రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar Periasamy) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, వివేక్ కృష్ణాని..లు కలిసి ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ ‘సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్’ సంస్థలపై నిర్మించారు.

Amaran

తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇదిలా ఉండగా..ఊహించని విధంగా ‘అమరన్’ సినిమా దర్శకనిర్మాతలకు ఇప్పుడు లీగల్ నోటీసులు అందడం చర్చనీయాంశం అయ్యింది. విషయం ఏంటంటే.. ‘అమరన్’ సినిమాలో సాయి పల్లవి ఓ పేపర్ పై మొబైల్ నెంబర్ రాసి ఇస్తుంది. దానిపై ఉన్న నెంబర్ తనదే అంటూ ఓ స్టూడెంట్ కేసు వేసింది.

ఆ నెంబర్ సాయి పల్లవి నెంబర్ అనుకుని చాలా మంది తనకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారట. తన అనుమతి లేకుండా.. ఆమె ఫోన్ నెంబర్ వాడినందుకు గాను ‘అమరన్’ నిర్మాతలకి ఆమె నోటీసులు పంపింది. తన ప్రైవసీకి భంగం కలిగించినందుకు గాను రూ.1.1 కోట్లు పరువు నష్టం దావా వేసింది. ఈ విషయం పై ‘అమరన్’ దర్శకనిర్మాతలు ఇంకా స్పందించలేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.