March 19, 202501:47:12 PM

Anurag Kulkarni: స్టార్ సింగర్స్ అనురాగ్, రమ్య..ల పెళ్లి ఫోటో వైరల్!

Anurag Kulkarni

ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లీడుకు వచ్చిన వాళ్లంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా పెళ్లిపీటలెక్కుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. స్టార్ డైరెక్టర్ క్రిష్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘కలర్ ఫోటో’ (Colour Photo) దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj) కూడా తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ కూడా పెళ్లి చేసుకున్నాడు. అతను మరెవరో కాదు సింగర్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) . అవును చాలా సైలెంట్ గా ఈ స్టార్ సింగర్ పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు.

మరో సింగర్ అయినటువంటి రమ్య బెహరాని (Ramya Behara) అతను నిన్న(శుక్రవారం నవంబర్ 15న) సాయంత్రం పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనురాగ్ సన్నిహితులు కూడా ఈ ఫోటోని షేర్ చేస్తూ తమ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. తెలంగాణాలోని కామారెడ్డికి చెందిన అనురాగ్ ‘ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8 ‘ విన్నర్ గా నిలిచి ఫేమస్ అయ్యాడు. రామ్ (Ram) నటించిన ‘హైపర్’ (Hyper) సినిమాలోని ‘బేబీ డాల్’ పాటతో ఇతనికి సినిమాల్లో గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ‘శతమానం భవతి'(Shatamanam Bhavati) సినిమాలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ అనే పాట ఇతనికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అటు తర్వాత ‘కాటమరాయుడు’ (Katam Rayudu) ‘పైసా వసూల్’ (Paisa Vasool) ‘లై’ (Lie) ‘మహానటి’ (Mahanati) ‘ఆర్.ఎక్స్.100’ ‘గీత గోవిందం’ (Geetha Govindam) ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) ‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) వంటి బడా సినిమాల్లో పాటలు పాడాడు. ఇటీవల వచ్చిన ‘అమరన్’ (Amaran) లో ‘రంగులే’ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ని పాడింది కూడా ఇతనే. ఇక రమ్య బెహరా కూడా ‘రంగులే’ పాటని అనురాగ్ తో కలిసి పాడింది. వీరి కాంబోలో చాలా చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.