
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా అమృత అయ్యర్ (Amritha Aiyer) Rao RameshSai KumarKota Jayaram హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) . సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తో ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) వంటి చిత్రాన్ని తెరకెక్కించిన సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. డిసెంబర్ 20 న ఈ సినిమా విడుదల కాబోతుంది. కొద్దిసేపటి క్రితం టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 : 27 నిమిషాల నిడివి కలిగి ఉంది.
Bachhala Malli Teaser Review
‘బచ్చల మల్లి’ టీజర్ మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ తో ముడిపడి ఉంది. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల మాట వినకుండా మూర్ఖంగా పెరిగిన ఓ కుర్రాడు.. నిత్యం గొడవలు పడుతూ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు అనేది ఈ చిత్రం కథగా తెలుస్తుంది. హీరోయిన్ దగ్గర కూడా నాకు మందు, సిగరెట్, అమ్మాయిల అలవాటు ఉంది అని చెప్పడాన్ని బట్టి.. అతని క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
టీజర్ చివర్లో పిల్లలు చందాలు అడిగితే.. వాళ్ళ కాయిన్ బాక్స్..లు హీరో తీసుకుపోయే విజువల్ హైలెట్ అనిపించింది. మొత్తంగా ఈ సినిమాలో అల్లరి నరేష్ చాలా మాస్ గా కనిపించబోతున్నాడు. పెర్ఫార్మన్స్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుంది అని ఈ టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. నిజజీవితంలోని ఓ క్యారెక్టర్ ని తీసుకుని దర్శకుడు ఈ కథ రాసుకున్నాడట. మీరు కూడా టీజర్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.