March 23, 202508:41:19 AM

Balakrishna: ఒక్క మాటతో NBK109 టెన్షన్ తీర్చేసిన బాలయ్య!

టాలీవుడ్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస విజయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన సినిమాలకు భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ‘అఖండ(Akhanda) ,’ ‘వీరసింహారెడ్డి,’(Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’(Bhagavath Kesari)  వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘NBK 109’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాబీ కొల్లి (Bobby)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఎప్పటినుండో అభిమానులు ఈ సినిమా టైటిల్ ఏంటనే టెన్షన్ లో ఉన్నారు.

Balakrishna

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, యాక్షన్ గ్లింప్సెస్ తో బాలయ్య తన మాస్ లుక్ లో అదరగొడతారని అర్థమైంది. అలాగే, ఈ చిత్రంలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. దీపావళికి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు, అదే సమయంలో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

అయితే టీజర్ కోసం ఎప్పటినుండో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ విషయంలో కూడా అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. వీరమాస్, డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ వంటి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ టైటిల్ లో ఏది ఫిక్స్ అవుతుందోనని చర్చ సాగింది. ఇక బాలయ్య ‘డాకూ మహారాజ్’ అనే టైటిల్ పై ఆసక్తి చూపించి, అదే టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

కార్తీక పౌర్ణమి రోజున ‘డాకూ మహారాజ్’ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ టీజర్ విడుదలతో అభిమానుల అంచనాలు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ టైటిల్‌కి సంబంధించిన టీజర్ ఇప్పటికే తయారైంది. సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తారని తెలుస్తోంది. టీజర్ విడుదల సమయంలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.