March 17, 202507:29:33 AM

‘ది రానా దగ్గుబాటి షో’ ట్రైలర్…రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నార్త్ లో టాక్ షోలు చాలా పాపులర్. అక్కడి జనాలకి సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావాలి. అవి వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్. అందుకే అక్కడ గాసిప్పులు బాగా ఫేమస్. కొన్నాళ్ళకి బిజినెస్ కోసం గాసిప్పులని కూడా వాడుకుంటూ వచ్చారు నార్త్ ఫిలిం మేకర్స్. తమ సినిమాని కమర్షియల్ గా ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయం వారికి తెలియజేసింది గాసిప్స్ అనే చెప్పాలి. అటు తర్వాత వాటిని మరింతగా క్యాష్ చేసుకోవడానికి టాక్ షోల కల్చర్ ని తీసుకొచ్చారు.

Rana Daggubati

కపిల్ శర్మ, కరణ్ జోహార్ వంటి వాళ్ళు హోస్ట్ చేసే టాక్ షోలు అక్కడ బాగా ఫేమస్. తర్వాత కొన్ని ఓటీటీ సంస్థల వల్ల తెలుగులో కూడా టాక్ షోలు మొదలయ్యాయి. మంచు లక్ష్మీ హోస్ట్ చేసిన పలు టాక్ షోలు..ఇక్కడ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. తర్వాత రానా నెంబర్ వన్ యారీ షో కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మరో టాక్ షో మొదలుకానుంది. రానా (Rana Daggubati ) దీనికి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో మొదలు కాబోతున్న ఈ టాక్ షోలో ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రానా.. నాని, తేజ సజ్జ, సిద్దు జొన్నలగడ్డ, రాంగోపాల్ వర్మ, శ్రీలీల.. వంటి వారితో ముచ్చటించాడు. అలాగే రాంగోపాల్ వర్మ, రిషబ్ శెట్టి వంటి పాన్ ఇండియా స్టార్స్ తో కూడా ఎపిసోడ్స్ ఉన్నాయి.

ఓ చోట.. రాజమౌళిని రానా (Rana Daggubati ) ‘బాహుబలి టైంలో ఇంత కామ్, కూల్ గా ఉన్న ఆఫీస్ ను ఎందుకు తీసుకోలేదు సార్’ అంటూ ప్రశ్నించాడు. అందుకు రాజమౌళి ‘బాహుబలి టైంలో డబ్బుల్లేవ్’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అది ఈ ట్రైలర్ కి హైలెట్ అయ్యింది.

‘పుష్ప 2’.. నా వర్క్ తో దర్శకుడు, హీరో హ్యాపీ.. ఓపెన్ అయిన తమన్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.