March 17, 202506:03:42 PM

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్‌ క్రికెటర్‌ భార్య.. ఏ సినిమాలో తెలుసా?

స్టార్‌ క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లకు ఆయన భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma) గురించి తెలిసే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాహల్‌ కంటే ఆమెనే ఫేమస్‌ కూడా. అలాంటి ఆమె ఇప్పుడు తెలుగు సినిమాలో అడుగుపెడుతోంది. యూట్యూబర్, సోషల్‌ మీడియాల ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు పరిచయమున్నధనశ్రీ వర్మ త్వరలో దిల్ రాజు (Dil Raju) బ్యానర్‌లో ఓ సినిమా నటస్తోందట. యంగ్‌ కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా ‘ఆకాశం దాటి వస్తావా’ అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Dhanashree Verma

ఇందులో ఓ హీరోయిన్‌గా మలయాళ నటి కార్తీక మురశీధరన్ నటిస్తోంది. మరో నాయికగా ధనశ్రీని (Dhanashree Verma) ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమాలో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ (Run Raja Run ) సినిమాలో నటించిన సీరత్ కపూర్ (Seerat Kapoor) కూడా నటిస్తోంది. ఇక ధనశ్రీ గురించి చూస్తే.. ఆరేళ్ల వయసు నుండే భరత నాట్యం నేర్చుకుందామె. తన నృత్య ప్రదర్శనలతో బాగా ఫేమస్ కూడా. ఇప్పుడు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌, వీడియోస్‌తో ఇంకా ఫేమస్‌.

డెంటిస్ట్‌గా అయిన ధనశ్రీ ఇప్పుడు పూర్తిగా డ్యాన్స్‌ మీదనే దృష్టి పెట్టింది. ‘అపర్ శక్తి ఖురానా..’, ‘ఓయే హోయే హోయే..’ తదితర హిందీ ఆల్బమ్స్‌తో మరింత పేరు సంపాదించుకుంది. ‘ఆకాశం దాటి వస్తావా’ సినిమా విషయానికొస్తే.. శశి కుమార్ ముతిల్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ గాయకుడు కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న పాత్రలో ప్రధాన నటులు అందరూ ఆ బ్యాగ్రౌండ్‌ వారినే తీసుకుంటున్నట్లు సమాచారం. ముందు యశ్‌, ఇప్పుడు ధనశ్రీ అలానే సినిమాలోకి వచ్చారట.

ఇక ఈ సినిమాకు సంబంధించి టీజర్, ఓ పాట ఇప్పటికే వచ్చాయి. వాటికి మంచి స్పందన కూడా వచ్చింది. ఈ క్రమంలో ధనశ్రీ తోడవడంతో సినిమాకు సోషల్‌ మీడియాలో మంచి హైప్‌ ఉంటుంది అని అనిపిస్తోంది. హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్సితా రెడ్డి (Hanshitha Reddy) సంయుక్తంగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఇది. త్వరలో విడుదల తేదీ అనౌన్స్‌ చేస్తారట.

పెద్ద ప్రీరిలీజ్‌లు ఇక హైదరాబాద్‌లో ఉండవా.. ఇక్కడ అనుమతులు ఇవ్వరా?

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.