March 20, 202510:34:33 PM

సినీ పరిశ్రమలో విషాదం..దర్శకుడి కొడుకు కన్నుమూత!

సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరొక సెలబ్రిటీ మరణిస్తూనే ఉన్నారు. దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాల సినీ ప్రముఖులు లేదంటే వారి కుటుంబ సభ్యులు మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ డైరెక్టర్ కొడుకు కార్ యాక్సిడెంట్..కు గురయ్యి, ప్రాణాలు విడిచాడు. హిందీ సినీ పరిశ్రమలో ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.

Ashwini Dhir

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకుడు అశ్విని ధిర్ (Ashwini Dhir) తనయుడు అయినటువంటి జలజ్ ధిర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. పనులు విడిచాడు. అతని వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం. స్నేహితులతో కలిసి సరదాగా ముంబై రోడ్లపై రైడ్ కి వెళ్లిన జలజ్ ధిర్.. అతని ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడట. తర్వాత అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది.

జలజ్ ధిర్ మాత్రమే కాకుండా అతని స్నేహితుడు కౌశిక్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడని సమాచారం. జలజ్ ధిర్ అలాగే అతని స్నేహితుడు సాహిల్ మద్యం సేవించి ర్యాష్ గా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ముంబై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అశ్వినీ ధిర్(Ashwini Dhir)  ‘సన్ ఆఫ్ సర్దార్’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. కొడుకు మరణంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

‘పుష్ప 2’ లాంగ్ రన్ టైమ్.. నిర్మాత ఊహించని కామెంట్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.