March 30, 202507:57:06 PM

Coolie, Vishwambhara: మళ్ళీ ‘భోళా శంకర్’ సీన్ రిపీట్ అవ్వదు కదా..!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)  హీరోగా తెరకెక్కిన ‘వేట్టయన్’ (Vettaiyan) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైంది. ఈ సినిమా సబ్జెక్ట్ వైజ్ బాగున్నప్పటికీ… స్క్రీన్ ప్లేలో ల్యాగ్ ఉండటంతో ‘జైలర్’ స్థాయిలో విజయం సాధించలేదు. ఇక దీని తర్వాత లోకేష్ కనగరాజ్  (Lokesh Kanagaraj) తో ‘కూలీ’ (Coolie)  అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేస్తున్నారు రజినీకాంత్. ఆల్రెడీ కొంత భాగం షూట్ అయ్యింది. అయితే ఇప్పుడు రజినీకాంత్ ఆరోగ్యం బాగోలేని కారణంగా.. షూటింగ్ వాయిదా పడింది.

Coolie, Vishwambhara:

మరో 2,3 వారాల పాటు రజినీకాంత్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారట. సో ఇప్పుడు లోకేష్ ప్లాన్స్ అన్నీ మారాయి. అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవచ్చు. అందువల్ల మార్చ్ లో అనుకున్న రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కూలీ’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే మొదటి వారం రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఆ టైంకి పరీక్షలు అన్నీ అయిపోయి హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తుంటుంది యువత. అందువల్ల సినిమాకు మరింతగా కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే అదే టైంలో చిరంజీవి  (Chiranjeevi) ‘విశ్వంభర’  (Vishwambhara)  చిత్రాన్ని కూడా విడుదల చేయాలని మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta)  అండ్ టీం భావిస్తున్నారు. మే 9న అంటే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) రిలీజ్ డేట్ న..

‘విశ్వంభర’ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా అయితే ‘కూలీ’ తో ‘విశ్వంభర’ కి పోటీ తప్పదు.చిరు, రజినీ..ల గత చిత్రాలు ‘జైలర్’ ‘భోళా శంకర్’ (Bhola Shankar) కూడా ఒక్క రోజు గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. వీటిలో ‘జైలర్’ బ్లాక్ బస్టర్ కాగా ‘భోళా శంకర్’ డిజాస్టర్ అయ్యింది. మరి 2025 సమ్మర్ కి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

హీరోగా దశాబ్దకాలం పూర్తిచేసుకున్న సాయి ధరమ్ తేజ్..అది మాత్రం రేర్ ఫీట్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.