
అశోక్ గల్లా ‘హీరో’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా చేశాడు. మైథలాజికల్ టచ్ తో కూడిన కమర్షియల్ మూవీ ఇది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. బోయపాటి శ్రీను శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘హనుమాన్’ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ కథ అందించడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.11 cr |
సీడెడ్ | 0.01 cr |
ఆంధ్ర(టోటల్) | 0.11 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.23 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.03 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.26 cr (షేర్) |
‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.0.26 కోట్లు షేర్ ను రాబట్టింది. అవి కూడా నెగిటివ్ షేర్స్ వంటివి తీయకుండా..! ఏదేమైనా బ్రేక్ ఈవెన్ కి ఏకంగా రూ.5.24 కోట్ల షేర్ ను రాబట్టాలి..!