March 27, 202503:31:06 AM

Devaki Nandana Vasudeva Trailer Review: మహేష్ మేనల్లుడు ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే!

మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు గల్లా అశోక్ (Ashok Galla) ‘హీరో’గా డెబ్యూ ఇచ్చాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ‘గుణ 369’ దర్శకుడు అర్జున్ జంధ్యాలతో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) చిత్రం చేశాడు. ‘హనుమాన్’ (Hanu Man) ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  దీనికి కథ అందించడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల నవంబర్ 22 కి వాయిదా పడింది.

Devaki Nandana Vasudeva Trailer Review

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల డోస్ పెంచారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ రెండున్నర నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘వాసుదేవుడి చక్రం’ గురించి జస్ట్ ఒక మాట చెప్పి వెంటనే హీరోని పరిచయం చేశారు. అతని జాతకం ప్రకారం ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టు.. అతని తల్లి చెబుతుంది. మరోపక్క విలన్ కి… తన సోదరి సంతానం వల్ల అతనికి ప్రాణ గండం ఉందని తెలియడంతో కుటుంబం పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని చూపించారు.

మధ్యలో హీరోయిన్ తో హీరో రొమాంటిక్ ట్రాక్. ‘నా జీవితంలో బోలెడంత స్పేస్ ఉంది వాడేసుకుందాం దా’ వంటి డైలాగ్.. కొంచెం ఇబ్బంది పెట్టినా.. ట్రైలర్ చివర్లో వాసుదేవుడి అవతారాన్ని చూపిస్తూ ఆసక్తిని రేకెత్తించారు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కొంచెం ‘మురారి’ రోజులను గుర్తు చేసింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రాజా సాబ్‌.. చిన్న సినిమా కాదంటున్న నిర్మాత.. ఊహించనంత భారీగా..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.