March 23, 202505:36:43 AM

Dhanush: ధనుష్‌వి ఇన్ని సినిమాలు ఆగిపోయాయా? ఇవి కూడా వచ్చుంటేనా?

ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్‌ (Dhanush) సినిమాల ఎంపిక చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వరుసగా రెండు ఒకేలాంటి కథలను ఆయన ఎంపిక చేయరు. ఒకవేళ చేసినా అందులో ఆయన తనదైన వైవిధ్యం చూపిస్తారు. ఆయన నుండి వచ్చిన సినిమాలు చూసి ఈ మాట అంటున్నారు. ఆయన అనుకున్నవి, స్టార్ట్‌ చేసినవి అన్నీ వచ్చి ఉంటే ఆయన వెర్సటాలిటీ గురించి ఇంకా ఎక్కువ చెప్పేవాళ్లు. ఎందుకంటే అరడజనుకుపైగా ఆయన సినిమాలు ఆగిపోయాయి. ధనుష్‌ ఓకే అనుకుని, అనౌన్స్‌ చేసి, కాస్త షూటింగ్ అయిన సినిమాలు చాలా ఆగిపోయాయి.

Dhanush

వాటిలో ‘అయిరాథిల్‌ ఒరువన్‌ 2’ ఉంది. ఆయన అన్నయ్య సెల్వ రాఘవన్‌ (Selvaraghavan) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాను అనుకోని పరిస్థితుల్లో ఆపేశారు. అలాగే సెల్వ డైరక్షన్‌లోనే ‘ఇట్స్‌ యాన్‌ ఈవెనింగ్‌ ట్రాన్స్‌’ అనే సినిమా కూడా చేశారు. ఈ సినిమా ఎందుకో కానీ రిలీజ్‌ చేయలేదు. ఈ సినిమా ధనుష్‌ వైద్యుడిగా నటించాడు. తొలి నాళ్లలో ‘డాక్టర్స్‌’ అనే సినిమా కూడా ఇద్దరూ కలసి చేశారు. కానీ రాలేదు.

మరోవైపు ఆయన ‘పా.పాండి’ తర్వాత సొంత దర్శకత్వంలో మొదలు పెట్టిన సినిమా కూడా మధ్యలోనే ఆపేశారు. ఆ సినిమాలో అదితీరావ్‌ హైదరిని (Aditi Rao Hydari) హీరోయిన్‌ అనుకున్నారు. అరవింద్‌ కృష్ణ దర్శకత్వంలో ధనుష్‌ ‘థీఫ్‌ పోలీస్‌’ అనే సినిమా చేశాడు. ఏమో అది కూడా విడుదల కాలేదు. ‘గ్యాంబ్లర్‌’ అనే పేరుతో ధనుష్‌ – వెట్రిమారన్‌ (Vetrimaaran) ఓ సినిమా స్టార్ట్‌ చేశారు. జూదం నేపథ్యంలో రూపొందాల్సిన సినిమా అది. కానీ వర్కవుట్‌ కాక మధ్యలోనే ఆగిపోయింది.

అదే వెట్రిమారన్‌తో ‘నేషనల్‌ హైవే’ అనే మరో సినిమా కూడా షూటింగ్‌ చేశారు. ఈ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. సినిమా విషయంలో ఏం జరిగి ఈ సినిమా రాలేదో కానీ.. వచ్చి బాగా ఆడి ఉంటే ధనుష్‌ ఇంకాస్త హై లెవల్‌లో ఉండేవాడు అని చెప్పాలి. ఎందుకంటే సినిమా పోస్టర్లు, కొన్ని కాన్సెప్ట్‌లు అదిరిపోయాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.