March 25, 202511:44:36 AM

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ బిజినెస్ పై టీజర్ ఎఫెక్ట్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్  (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్'(Game Changer)  అనే భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  తర్వాత రాంచరణ్ సోలో హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తుండగా.. అంజలి (Anjali) , శ్రీకాంత్ (Srikanth) , సునీల్ (Sunil) , ఎస్.జె.సూర్య (SJ Suryah), జయరాం (Jayaram).. వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Game Changer

సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి చాలా రోజులు అయ్యింది. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రెండు పాటలను విడుదల చేశారు. అలాగే టీజర్ లాంచ్ వేడుకను లక్నోలో నిర్వహించారు. అయితే టీజర్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉండగా.. ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగడం లేదు అనేది ఇన్సైడ్ టాక్. నాన్ థియేట్రికల్ డీల్ ను దిల్ రాజు రూ.180 కోట్లకి క్లోజ్ చేసినట్లు టాక్. అయితే థియేట్రికల్ రైట్స్ ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule) రేంజ్లో జరగలేదు అని అంటున్నారు.

ఎందుకంటే శంకర్ గత చిత్రం ‘ఇండియన్ 2′(‘భారతీయుడు 2’) (Bharateeyudu 2) తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.దానికి తోడు గేమ్ ఛేంజర్ టీజర్ కి కూడా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు చెప్పే భారీ రేట్లకు బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని సమాచారం. కాబట్టి ఇంకో టీజర్ ను విడుదల చేస్తే మంచిదని దిల్ రాజు భావిస్తున్నారట. ట్రైలర్ ని డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.