March 15, 202512:18:48 PM

Game Changer: గేమ్ ఛేంజర్.. ఎటు వెళ్లినా పోటీ తప్పదు!

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో హై వోల్టేజ్ పోటీకి మారటానికి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, శంకర్ (Shankar)  దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer)  జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు (Game Changer)  నిర్మించిన ఈ చిత్రం చరణ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అయితే ఈసారి సినిమాకి సడెన్‌గా ఎదురవుతున్న పోటీలు నిర్మాతలకు తలనొప్పిగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’కి గట్టి పోటీగా బాలకృష్ణ(Nandamuri Balakrishna)   నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)  సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Game Changer

బాలయ్య క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా హైప్ ఎక్కువగా ఉండటం గమనార్హం. అదే సమయంలో వెంకటేష్ (Venkatesh)  హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా అదే తేదీకి విడుదల కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam)  చిత్రం కూడా దిల్ రాజు నిర్మించడం విశేషం, అయితే ఈ రెండు సినిమాల థియేటర్ షేర్ గురించి దిల్ రాజు మంచి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.

తమిళనాడులో మాత్రం పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. అజిత్  (Ajith) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా అదే రోజున విడుదల కానుంది. అజిత్‌కు తమిళనాడులో ఉన్న క్రేజ్ కారణంగా ‘గేమ్ ఛేంజర్’ అక్కడ ఎదుర్కొనే సవాళ్లు మరింత కఠినంగా మారవచ్చు. తమిళ ప్రేక్షకులు ఎక్కువగా తమ సొంత చిత్రాలను ప్రాధాన్యత ఇవ్వడంతో ‘గేమ్ ఛేంజర్’కి ఓపెనింగ్స్ పై ప్రభావం పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

హిందీ మార్కెట్ విషయానికి వస్తే, అక్కడ పోటీ తక్కువగా ఉన్నప్పటికీ, రామ్ చరణ్‌కు ‘ఆర్ఆర్ఆర్’తో (RRR) వచ్చిన క్రేజ్ ఎంతవరకు నిలబెడుతుందన్నదే కీలకం. గత కొన్నేళ్లుగా శంకర్ తీసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం, అతనిపై నార్త్ ఇండియా ప్రేక్షకుల దృష్టి తగ్గడం గేమ్ ఛేంజర్‌పై ప్రభావం చూపవచ్చు. టీజర్‌కి పర్వాలేదనే స్పందన వచ్చినప్పటికీ, ట్రైలర్‌లో స్ట్రాంగ్ కంటెంట్ చూపించకపోతే సినిమా గ్లామర్ తగ్గే అవకాశం ఉంది. ఇన్ని సవాళ్ల మధ్య ‘గేమ్ ఛేంజర్’ ఎంతవరకు నిలబడుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.