
ఘట్టమనేని ఫ్యామిలీకి (Ghattamaneni Family) చెందిన వారి ఇంట్లో ఏ వేడుక జరిగినా..కుటుంబమంతా ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ‘సూపర్ స్టార్ కృష్ణ నుండి కుటుంబ సభ్యులు నేర్చుకున్నది ఇదే’ అంటూ వాళ్ళు పలుమార్లు చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఘట్టమనేని ఫ్యామిలీ అంతా ఒక చోట చేరింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోల్లో మహేష్ బాబుతో (Mahesh Babu) పాటు సుధీర్ బాబు (Sudheer Babu) , అతని భార్య ప్రియదర్శిని, నమ్రత (Namrata Shirodkar) , సితార, గల్లా జయదేవ్ ఫ్యామిలీ, దివంగత రమేష్ బాబు (Ramesh Babu) ఫ్యామిలీ, మంజుల (Manjula) అండ్ ఫ్యామిలీ ఉన్నారు.
Ghattamaneni Family
ఈ ఫోటోలు ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఖుషి చేయిస్తుంది. ఇటీవల అంటే నవంబర్ 8న కృష్ణ (Krishna) రెండో కుమార్తె.. అంటే మహేష్ చిన్నక్క అయినటువంటి మంజుల బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సుధీర్ బాబు, ప్రియదర్శిని ఇంట్లో మంజుల బర్త్ డేని కుటుంబ సభ్యులంతా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోల్లో ఇది కూడా ఒకటి అని సమాచారం.
‘ఇప్పటికీ తన బర్త్ డే లవ్ ని ఆస్వాదిస్తున్నట్టు మంజుల తన ఇన్స్టాలో రాసుకొచ్చింది. మంజుల కామెంట్స్ కి నమ్రత స్పందించి ‘ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని సెలబ్రేట్ చేసుకోవాలి వదిన’ అంటూ కామెంట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఇందులో మహేష్ బాబు క్యాప్ పెట్టుకుని చెక్ షర్ట్ తో చాలా స్టైలిష్ గా ఉన్నాడు.
View this post on Instagram
View this post on Instagram