March 24, 202508:25:54 AM

Kanguva: కంగువకు తమిళనాట థియేటర్లు దొరకడం లేదు అనే వార్తలో నిజమెంత!

మరో రెండ్రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న “కంగువ”(Kanguva) విషయంలో పబ్లిసిటీ కోసమో లేక సింపతీ క్రియేట్ చేయడం కోసమో తెలియదు కానీ.. తమిళనాట ఆ సినిమాకి థియేటర్లు సరిగా ఇవ్వడం లేదు అనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. శివకార్తికేయన్ (Sivakarthikeyan) “అమరన్” (Amaran) సినిమా కోసం థియేటర్లు హోల్డ్ లో పెట్టారని, అందుకే “కంగువ”కు తమిళనాట ఆశించినన్ని థియేటర్లు దొరకడం లేదు అనేది చెన్నై వర్గాలు స్ప్రెడ్ చేస్తున్న న్యూస్.

Kanguva

అయితే.. “అమరన్” నిర్మాత కమల్ హాసన్ కి (Kamal Haasan) సూర్యతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన బిగ్గెస్ట్ హిట్ అయిన “విక్రమ్” (Vikram) సినిమాలో రోలెక్స్ గా సూర్య (Suriya)  మెరిసి, ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాంటి సూర్య సినిమాకి కమల్ హాసన్ థియేటర్లు రానివ్వకుండా అడ్డుపడతాడు అని అనుకోవడం హాస్యాస్పదం అవుతుంది. అందులోనూ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) తమిళనాట దిల్ రాజు  (Dil Raju)  లాంటోడు. అక్కడ అతడు తిప్పే చక్రానికి ఒక్కోసారి డిస్ట్రిబ్యూటర్లే అవాక్కవుతుంటారు.

అలాంటప్పుడు “కంగువ” థియేటర్ల విషయంలో ఆయన ఎందుకు తగ్గుతాడు? దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా విషయంలో వేరే నిర్మాతలు కూడా థియేటర్లు ఇవ్వను అనే అవకాశం చాలా రేర్ గా ఉంటుంది. మరి “కంగువ”కి తమిళనాట థియేటర్లు ఇవ్వడం విషయంలో జరుగుతున్న రచ్చ విషయంపై జ్ఞానవేల్ రాజా అర్జెంట్ గా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

లేకపోతే.. మాత్రం లేనిపోని రూమర్స్ తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే.. లాంగ్ వీకెండ్ టార్గెట్ గా విడుదలవుతున్న ఈ సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని జ్ఞానవేల్ రాజా ఇచ్చిన స్టేట్మెంట్, దానికి సపోర్ట్ గా సూర్య “అందులో తప్పేముంది?” ఇచ్చిన స్టేట్మెంట్ అందరికీ గుర్తుండే ఉంటాయి.

చేతికి సెలైన్ పెట్టుకున్న నటి పూజిత పొన్నాడ.. షాకిస్తున్న ఫోటో !

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.