March 22, 202503:20:17 AM

Kriti Sanon: నెపోటిజంకు కారకులు ప్రేక్షకులే.. మహేష్ హీరోయిన్!

సినీ పరిశ్రమలో నెపోటిజం అనే మాట తరచుగా వినిపించేది. సినీ కుటుంబాలకు చెందిన వాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శలు రావడం సర్వసాధారణం. కానీ, ఈ వివాదం కేవలం పరిశ్రమ వరకే పరిమితం కాకుండా, ప్రేక్షకులు, మీడియా కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని నటి కృతి సనన్  (Kriti Sanon) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో జరిగిన 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆమె, ఈ అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. “నెపోటిజానికి కారణం ఒక్క పరిశ్రమ కాదు.

Kriti Sanon

ప్రేక్షకులు, మీడియా కూడా సమానంగా బాధ్యత వహిస్తాయి. మీడియా తరచూ స్టార్ కిడ్స్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అది చూస్తూ, ప్రేక్షకులు వారిని చూసేందుకు ఆసక్తి చూపుతారు. దాంతో, పరిశ్రమ వాళ్లతోనే సినిమాలు చేయాలని భావిస్తుంది. ఈ సర్కిల్ ఒక దశలో ఆగకుండా కొనసాగుతూ ఉంటుంది,” అని కృతి వివరించారు. అయితే, ప్రతిభ ఉంటేనే అవకాశాలు లభిస్తాయని, టాలెంట్ లేకపోతే పరిశ్రమలో నిలవడం అసాధ్యమని ఆమె అన్నారు.

“మీరు ఎంతటి ఫ్యామిలీ నుంచి వచ్చినా, మీలో టాలెంట్ లేకపోతే ప్రేక్షకులతో మీకు కనెక్ట్ కావడం చాలా కష్టం. టాలెంట్ ఉన్నవారికి ప్రేక్షకులు ఎప్పుడూ గౌరవం ఇస్తారు,” అని కృతి నెపోటిజంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఈ వివరణ కాంట్రవర్సీలకు దూరంగా ఉండటం మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృతి సనన్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె మహేష్ బాబు (Mahesh Babu) 1-నేనొక్కడినే (1: Nenokkadine) చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

ఆ సినిమా ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలను తెచ్చింది. తరువాత ఆమె టైగర్ శ్రాఫ్ సరసన హీరోపంతి సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్‌లో మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఇక కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ (Nupur Sanon) కూడా తెరపై గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె రవితేజ (Ravi Teja) టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) చిత్రంలో హీరోయిన్‌గా పరిచయమై ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

లీక్డ్ వీడియో పై నటి కామెంట్స్.. వాళ్ళ ఆలోచనలు అలాంటివని తెలిసింది!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.