March 22, 202510:21:55 AM

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ ..మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది. వెంకీ అట్లూరి (Venky Atluri)  డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31 న విడుదలైన ఈ సినిమాకి అక్టోబర్ 30 నైట్ నుండి ప్రీమియర్స్ వేశారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి వీకెండ్ ను అద్భుతంగా క్యాష్ చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది.

Lucky Baskhar Collections:

మొదటి సోమవారం కూడా డీసెంట్ గా కలెక్ట్ చేసింది. కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో కూడా ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. ఒకసారి (Lucky Baskhar) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.28 cr
సీడెడ్ 1.40 cr
ఆంధ్ర(టోటల్) 4.65 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 12.53 cr
తమిళనాడు 1.48 cr
కేరళ 4.10 cr
హిందీ 0.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.36 cr (తెలుగు వెర్షన్ )
ఓవర్సీస్ 6.40 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
వరల్డ్ వైడ్ (టోటల్ ) 25.12 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 5 రోజుల్లో రూ.13.29 కోట్ల షేర్ ను రాబట్టి రూ.1.79 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.25.12 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొదటి సోమవారం ‘క’ ఎలా కలెక్ట్ చేసిందంటే..?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.