March 22, 202507:58:54 AM

Meenakshi Chaudhary: మీనాక్షి పాప.. ఇంతలోనే లక్కు పాయే

టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న యువ హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  ఒకరు. సీనియర్స్ ను డామినేట్ చేస్తూ గ్లామర్ తోనే కాకుండా నటన తో కూడా ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఇటీవల సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ లో కనిపించినప్పటికీ ఆమె లక్కు ఎక్కువ రోజులు కొనసాగడం లేదు. కెరీర్‌లో స్థిరమైన స్థానం పొందడానికి ఇబ్బంది పడుతోంది. గుంటూరు కారం లో (Guntur Kaaram)  అమ్మడికి గుర్తింపు లేని పాత్ర దక్కింది, విజయ్ (Vijay Thalapathy)  ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time) లోను పెద్దగా గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు.

Meenakshi Chaudhary

అయితే ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ (Lucky Baskhar) మూవీ ఆమెకు కొంతకాలం ఆనందాన్ని తీసుకొచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన ఈ క్రైమ్ డ్రామా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి మూడు భాషల్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. భాస్కర్ భార్య పాత్రలో మీనాక్షి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆమె కెరీర్ పై పాజిటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది. కానీ ఈ విజయం ఎక్కువ కాలం నిలవలేదు.

ఇటీవల వచ్చిన మట్కా రూపంలో అమ్మడు మరో డిజాస్టర్ ను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. మట్కా (Matka)   సినిమాలో మీనాక్షి స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కథ, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటంతో ఆమె పాత్ర ప్రేక్షకులను బలంగా ప్రభావితం చేయలేకపోయింది. ప్రత్యేకించి, వరుణ్ తేజ్ భార్యగా ఆమె పాత్రకు ముగింపు సంతృప్తికరంగా లేకపోవడంతో ఫలితంగా లక్కీ భాస్కర్ ఇచ్చిన హైప్ ను నిలబెట్టుకోవడం కష్టమైంది.

ఈ సినిమా ఫెయిల్యూర్ ఆమెపై మరింత ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ 22న విశ్వక్ సేన్ (Vishwak Sen)  హీరోగా నటిస్తున్న మెకానిక్ రాకీ లో (Mechanic Rocky)  మీనాక్షి మరలా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి యూత్ ఫుల్ టచ్ ఎక్కువగా ఉంటుందని, మీనాక్షికి స్కోప్ ఉన్న పాత్రగా నిలుస్తుందని టాక్. ఇది సక్సెస్ అయితే ఆమె కెరీర్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.