March 18, 202503:13:37 AM

Meenakshi Chaudhary: పెళ్ళి వార్తలపై ఓపెన్ అయిపోయిన మీనాక్షి!

ఇప్పుడు టాలీవుడ్లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే.. అంతా టక్కున మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పేరే చెబుతారు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత రవితేజ  (Ravi Teja)  ‘ఖిలాడి’ (Khiladi) సినిమాలో కూడా నటించింది. అయితే అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే అడివి శేష్  (Adivi Sesh) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ 2’ (HIT: The Second Case) సినిమాతో మీనాక్షికి తొలి సక్సెస్ అందింది.

Meenakshi Chaudhary

ఆ సినిమా వల్ల ఈమెకు మహేష్ బాబు (Mahesh Babu)- త్రివిక్రమ్(Trivikram)..ల ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమాలో మీనాక్షిది చెప్పుకోదగ్గ పాత్ర కాదు. అందువల్ల బాగా ట్రోల్ అయ్యింది. దీంతో నిర్మాత నాగవంశీ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  సినిమాలో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. ఇక వెంటనే ‘మట్కా’ (Matka)  తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. మరో రెండు రోజుల్లో ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky)  సినిమా కూడా రిలీజ్ కాబోతుంది.

Meenakshi Chaudhary To Romance With Sushanth1

విశ్వక్ సేన్ (Vishwak Sen)  హీరోగా నటించిన ఈ సినిమా మీనాక్షికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఇటీవల మీనాక్షి గురించి మ్యారేజ్ రూమర్స్ ఎక్కువగా వచ్చాయి. ముందుగా ఈమె ఓ తమిళ హీరోతో ప్రేమలో ఉందని, అతన్ని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ రూమర్ వచ్చింది. అది అబద్దమని మీనాక్షి టీం క్లారిటీ ఇచ్చింది.

ఆ వెంటనే తన మొదటి సినిమా హీరో సుశాంత్ తో మీనాక్షి నిశ్చితార్థం ఫిక్స్ అని మరో ప్రచారం జరిగింది. అది కూడా అబద్దమని మీనాక్షి, సుశాంత్ (Sushanth) టీంలు క్లారిటీ ఇచ్చాయి. ‘ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో నాకు తెలీడం లేదు, ప్రస్తుతానికి నా దృష్టంతా నా కెరీర్ పైనే ఉంది’ అంటూ మీనాక్షి క్లారిటీ ఇచ్చింది.

విచారణకు రమ్మంటే.. RGV ఊహించని మెసేజ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.