March 22, 202504:39:14 AM

Nani, Sujeeth: క్రేజీ మల్టీస్టారర్ చేతులు మారిందా?

నేచురల్ స్టార్ నాని (Nani)  వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. ఆ సినిమాతో మంచి ఫలితాన్ని అందుకున్నాడు. నాని ఖాతాలో మరో హిట్టు పడినట్టు అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు కనుక రాకపోతే.. ఆ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేది అనేది వాస్తవం. ఇక ఆ సినిమా తర్వాత ‘దసరా’ (Dasara)   వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో  (Srikanth Odela) నాని నెక్స్ట్ సినిమా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు.

కానీ ‘హిట్ 3’ ని మొదలుపెట్టాడు నాని. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. మరోపక్క శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. దానికి ‘పారడైజ్’ అనే పేరును ఫిక్స్ చేశారు. అయితే మధ్యలో ‘ఓజీ’ (OG Movie) దర్శకుడు సుజీత్ తో (Sujeeth) కూడా నాని సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగింది.

డీవీవీ దానయ్య (D. V. V. Danayya)  ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ ఆ సినిమాకు రూ.125 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందట. నానికి అంత మార్కెట్ లేదు. ‘సరిపోదా శనివారం’ రూ.100 కోట్లు గ్రాస్ కొట్టినా.. ఎందుకో దానయ్యలో ధైర్యం రాలేదు. నాని- సుజీత్..ల ప్రాజెక్టు చేయలేను అని చెప్పాడట. దీంతో వెంకట్ బోయినపల్లి (Venkat Boyanapalli) ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.

గతంలో కూడా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వదులుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) చిత్రాన్ని.. ఇతను ముందుకొచ్చి నిర్మించాడు. దీంతో నానికి ఇతను బాగా దగ్గరైపోయాడు. ఇప్పుడు కూడా దానయ్య వద్దనుకున్న ప్రాజెక్టుని వెంకట్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక మల్టీస్టారర్ సినిమా అని తెలుస్తుంది. కథ ప్రకారం ఇందులో మరో హీరోకి ఛాన్స్ ఉందట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.