March 16, 202507:35:04 AM

Prabhas: బ్రేకులు లేకుండా ప్రభాస్ స్పీడ్.. ఎలా బ్యాలెన్స్ చేస్తాడో!

ఇండియన్ సినిమా రంగంలో ప్రభాస్  (Prabhas) ‘ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని సినిమా మార్కెట్ 500 కోట్లకు పైగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర హీరోలు సినిమా కోసం రెండు, మూడు సంవత్సరాల సమయం తీసుకుంటే, ప్రభాస్ మాత్రం ప్రతి ఏడాది ఒక సినిమా తీసుకురావాలని ఓ టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉండగా, వాటి బడ్జెట్ మొత్తం 3000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Prabhas

ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  చిత్రీకరణలో ఉన్నాడు. అంతే కాకుండా, సలార్ 2 (Salaar)  మూవీ షూటింగ్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. మరో వైపు హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సెట్స్ పై ఉండగా, సంక్రాంతి తర్వాత ప్రభాస్ ఈ చిత్రానికి జాయిన్ అవుతారని ప్రచారం ఉంది. ఇలా మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్  (Spirit) మూవీ డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత భూషణ్ కుమార్  (Bhushan Kumar) తెలిపారు.

ఇన్ని ప్రాజెక్ట్‌లను ఒక్కసారిగా నిర్వహించడం అంటే చాలా కష్టమైన పనిగా ఉంటుంది. ప్రతి సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్, వేరే బాడీ షేప్ మెయింటైన్ చేయాలి. అయినా కూడా ఈ ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో ప్రభాస్ ఉన్న నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మీడియం రేంజ్ హీరోలలో నాని (Nani)  కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ, ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా అందిస్తున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 షూటింగ్‌లో బిజీగా ఉండగా, వెంటనే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.

తదుపరి ప్రాజెక్ట్‌గా సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో మరో సినిమా సిద్ధంగా ఉండగా, ఈ రెండు మధ్యలో శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో మరో చిత్రాన్ని పూర్తి చేయాలని నాని ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా స్టార్ హీరోల్లో ప్రభాస్, మీడియం రేంజ్‌లో నాని సంవత్సరానికి ఒక సినిమాను రిలీజ్ చేయడం ప్రత్యేకం. ప్రభాస్, నాని లాంటి హీరోల స్పీడ్ చూసి మిగిలిన స్టార్ హీరోలు కూడా తమ సినిమాల ప్లానింగ్‌లో మార్పులు చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వేణుస్వామికి మరోసారి నోటీసులు.. ఈసారైనా వెళతారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.