March 26, 202508:24:21 AM

Pujita Ponnada: చేతికి సెలైన్ పెట్టుకున్న నటి పూజిత పొన్నాడ.. షాకిస్తున్న ఫోటో !

పూజిత పొన్నాడ (Pujita Ponnada ) అందరికీ సుపరిచితమే.కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన ఈమె తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. వాటి ద్వారా సంపాదించుకున్న పాపులారిటీ వల్ల ఈమెకు ‘ఊపిరి’ (Oopiri) ‘దర్శకుడు’ (Darsakudu) వంటి సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అటు తర్వాత చేసిన ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాతో ఈమెకు బ్రేక్ వచ్చింది.అటు తర్వాత ‘రాజు గాడు’ (Raju Gadu) ‘హ్యాపీ వెడ్డింగ్’ (Happy Wedding) ‘బ్రాండ్ బాబు’ (Brand Babu) ‘కల్కి’ ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ ‘కల్కి'(రాజశేఖర్) ‘రావణాసుర’ (Ravanasura) ‘జోరుగా హుషారుగా’ వంటి సినిమాల్లో నటించింది.

Pujita Ponnada

తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. పూజిత పొన్నాడ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అందులో ఆమె హాస్పిటల్ బెడ్ పై సెలైన్ పెట్టుకున్న ఫోటోని షేర్ చేసింది. అలాగే ‘ఇప్పుడు ఇండియా నన్ను పిలుస్తోంది’ అంటూ ఓ ట్యాగ్ లైన్ పెట్టింది. కానీ ఏమైంది అనే విషయాన్ని రివీల్ చేయలేదు. మరోవైపు ఆమె ఫాలోవర్స్ ‘పూజితకి ఏమైంది?’ అంటూ టెన్షన్ పడుతూ ఆరా తీస్తున్నారు.

‘ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి.. బహుశా సిక్ అయ్యిందేమో. అందుకే ఆమె నీరసం తగ్గడానికి వైద్యులు ఇలా సెలైన్… పెట్టి ఉండొచ్చు’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. మరికొందరు ‘సినిమా షూటింగ్లో భాగంగా పూజిత పొన్నాడ..ఈ ఫోటోని షేర్ చేసి ఉండొచ్చు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నిజం ఏంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈమె ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తుంది. అది తప్ప ఈమె చేతిలో ఇంకో ఆఫర్ లేదు అనే చెప్పాలి.

సైలెంట్ పెళ్లి చేసుకున్న నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.