March 16, 202507:35:02 AM

Pushpa 2: పుష్ప 2 ఐటెమ్ సాంగ్.. ఈసారి డబుల్ గ్లామర్!

‘పుష్ప’  (Pushpa)   సినిమాలో సమంత (Samantha) చేసిన ‘ఊ అంటావా’ పాట ఎంతటి క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ పాట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి వ్యూస్ పరంగా కూడా యూట్యూబ్ లో రికార్డుల్ని సృష్టించింది. ‘పుష్ప’ మూవీ సక్సెస్ లో ఈ ఐటెమ్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ‘పుష్ప 2’ లో (Pushpa 2)  అలాంటి సూపర్ హిట్ సాంగ్ అందించడానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), చంద్రబోస్ (Chandrabose) జోడీ మరోసారి రెడీ అవుతున్నారు.

Pushpa 2

ఇందులో సరికొత్తగా శ్రీలీలను (Sreeleela) ఎంపిక చేసినట్లు సమాచారం. శ్రీలీల డాన్స్ స్టెప్పులకు టాలీవుడ్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. ఆమె పర్ఫార్మెన్స్ తో పాటకు మరింత గ్లామర్ రానుంది. అంతేకాదు, టాక్ ప్రకారం ఈ పాటలో సమంత కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతోందట. అంటే ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో (Allu Arjun) పాటు ఒకేసారి ఇద్దరు భామలు అదిరిపోయే స్టెప్పులు వేయనున్నారు.

ఈ డబుల్ గ్లామర్ ఎట్రాక్షన్ ప్రేక్షకులకు పండగలా అనిపించనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయినట్లు టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.

ఇక స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత పాల్గొనడం వల్ల ఈ సాంగ్‌కి మరింత క్రేజ్ ఉంటుందని, నార్త్ ఇండియాలో సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందని అనుకుంటున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తుండగా, ఈ సినిమాలో ప్రముఖ నటులు ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil), సునీల్ (Sunil) , అనసూయ (Anasuya Bhardhwaj) , జగపతి బాబు (Jagaapathi Babu) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘పుష్ప 2’ సక్సెస్ అయితే ఆ క్రేజ్ ‘పుష్ప 3’ కి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మరి డైరెక్టర్ సుకుమార్  (Sukumar)  ఈసారి ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.