March 15, 202509:37:02 AM

Pushpa 2: మెగా కాంపౌండ్ లో పావులు కదుపుతున్న అల్లు అర్జున్

మెగా వర్సెస్ అల్లు అనే ప్రచ్ఛన్న యుద్ధం ఈ ఏడాది మే నుండి జరుగుతున్న విషయం తెలిసిందే. ఎలక్షన్స్ రిజల్ట్స్ వరకు సోషల్ మీడియాకి పరిమితమైన ఈ ఫ్యాన్ వార్స్ గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చాయి. ఇక రీసెంట్ గా “పుష్ప 2” రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తర్వాత ఈ వార్ మరింత ఉధృతమైంది. కట్ చేస్తే.. “పుష్ప 2” ట్రైలర్ రిలీజ్ కి ముందు ఆహాలో “ఆన్ స్టాపబుల్”లో బాలయ్య (Nandamuri Balakrishna).-బన్నీ(Allu Arjun)  ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ను పొగిడించి పవన్ ఫ్యాన్స్ బారినుంచి తప్పించుకున్నాడు బన్నీ.

Pushpa 2

అందుకే.. “పుష్ప 2” (Pushpa 2) ట్రైలర్ కు పెద్దగా ట్రోలింగ్ కానీ, అనవసరమైన కామెంట్స్ కానీ వినిపించలేదు, కనిపించలేదు. అదే విధంగా.. తెలుగుదేశం పార్టీ అంటే కోసుకునే వ్యక్తి తన స్నేహితుడు అని చెప్పి తెలుగు తమ్ముళ్లను కూడా తనవైపుకు తిప్పుకున్నాడు బన్నీ. ఇక నిన్న “కెసిఆర్” అనే చిన్న సినిమా వేడుకలో జనసేన పార్టీలో కీలక సభ్యుడు అయిన హైపర్ ఆది (Hyper Aadi) మాట్లాడుతూ పుష్ప 2 ట్రైలర్ గురించి, నటుడిగా అల్లు అర్జున్ స్థాయి గురించి చేసిన పాజిటివ్ కామెంట్స్ సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయాయి.

దాంతో.. పుష్ప 2 ట్రైలర్ విషయంలో మెగా ఫ్యామిలీ ఎవరూ స్పందించలేదు అనే టాక్ మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చింది. సినిమా రిలీజ్ కి ముందు మెగా కాంపౌండ్ హీరోల్లో కొందరు “పుష్ప 2” ప్రమోషన్స్ లో భాగమవ్వనున్నారని, అల్లు అర్జున్ తో కలిసి “పుష్ప 2” ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ నిజంగా చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా పుష్ప 2 ఈవెంట్ కి వస్తే గనుక “మెగా వర్సెస్ అల్లు” అనే రచ్చ పూర్తిగా మరుగునపడిపోతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.

గేమ్ ఛేంజర్ లో హైడ్రా గొడవలు.. నిజమేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.