March 24, 202508:50:23 AM

Pushpa 2: ‘పుష్ప: ది రూల్‌’.. అంతమంది సంగీత దర్శకులు ఎందుకు.. ఏం చేస్తున్నారు?

‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa) , ‘అఖండ’ సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఆ సమయంలో రెండు సినిమాల విజయాలతోపాటు.. రెండు సినిమాల నేపథ్య సంగీతం గురించి కూడా చర్చ జరిగింది. దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad),  బాగా సంగీతం ఇచ్చారా? లేక తమన్‌ సంగీతం బాగుందా అంటూ డిస్కషన్‌ పెట్టారు. ఫైనల్‌గా పాటల విషయంలో డీఎస్పీ హిట్ కొడితే.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో తమన్‌కు  (S.S.Thaman)   పతకం ఇచ్చేశారు. ఈ క్రమంలో ఓ సినిమాకు డీఎస్పీ, తమన్‌ కలిస్తే అదిరిపోతుంది అనే చర్చ కూడా జరిగింది.

Pushpa 2

అయితే అప్పుడు ఈ కాంబో కావాలి అని గట్టిగా కోరుకున్నవాళ్లకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ ‘పుష్ప: ది రూల్‌’కి (Pushpa 2) ఇద్దరూ కలసి పని చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ముందు పుకార్లు అనుకున్నారు కానీ.. ఆ తర్వాత అవే నిజమని తేలాయి. ఓ ఈవెంట్‌లో తమన్‌ ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు మాట మారింది. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా నేపథ్యం సంగీతం పనులు ఒకరు కాదు చాలామంది చేస్తున్నారని టాక్‌. ఈ టాక్‌కి తమన్‌ మాటలు ఆజ్యం పోసేలా ఉన్నాయి.

ఎందుకంటే ఈ సినిమాకు తనతోపాటు మరికొంతమంది పని చేస్తున్నారని ఆయనే చెప్పారు. ఈ ప్రాజెక్టులో తానూ ఒక భాగమేనని, మిగిలిన సంగీత దర్శకులు కూడా పని చేస్తున్నారని తమన్‌ చెప్పేశారు. అంటే ఇన్నాళ్లుగా పుకార్లు వస్తున్నట్లుగా అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath), సామ్ సిఎస్ (Sam C. S.) ఉన్నట్టు క్లారిటీ వచ్చినట్టే అని చెప్పొచ్చు. అయితే అధికారికంగా త్వరలో ప్రకటిస్తారు అని సమాచారం. ఆదివారం వచ్చిన ట్రైలర్‌ అయితే అదిరిపోయింది. నేపథ్య సంగీతం కూడా బాగుంది.

అయితే మరి దీనికి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చింది ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓవైపు ప్యాచ్‌ వర్క్‌ జరుపుకుంటూనే సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను వేగవంతం చేసింది టీమ్‌. అయితే మరో డ్యూయెట్‌ చిత్రీకరించాల్సి ఉందని అది త్వరలోనే ప్రారంభిస్తారు అని టాక్‌. ఆ పాటను అయితే దేవిశ్రీ ప్రసాదే స్వరపరిచారట.

హీరోయిన్‌ కాళ్ల దగ్గర హీరో.. సమంత ఇప్పుడు ఏమంటుందో? రియాక్ట్‌ అవుతుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.