March 22, 202502:27:04 AM

Raja Saab: ఆ రీమిక్స్ పాటకు అంత స్పెషాలిటీ ఉందా?

ప్రభాస్ (Prabhas) , దర్శకుడు మారుతి (Maruthi Dasari)  కాంబినేషన్లో ‘ది రాజాసాబ్’  (The Rajasaab) అనే సినిమా రూపొందుతుంది. హర్రర్ రొమాంటిక్ జోనర్ మూవీ ఇది అని.. టీం ముందు నుండి క్లారిటీగా చెబుతూ వస్తోంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయని, అందులో ఒకటి రీమిక్స్ సాంగ్ అని తాజాగా తమన్ (S.S.Thaman) చెప్పుకొచ్చాడు.

Raja Saab

ఈ క్రమంలో ఆ రీమిక్స్ పాట ఏమై ఉంటుందా అని సోషల్ మీడియాలో అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్లోని ‘ఇన్ సాఫ్ అప్‌నే ల‌హోసే’ (1994) అనే పాత సినిమాలో ‘హ‌వా… హ‌వా’ అనే పాట ఉంది. అప్పట్లో అందరినీ ఓ ఊపు ఊపిన పాట అది. ‘ది రాజా సాబ్’ కోసం ఆ పాట హ‌క్కుల్ని తీసుకున్నారట. ఈ పాట చిత్రీకరణ కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.

The Rajasaab

ప్రభాస్ డాన్సులు ఈ పాటలో అదిరిపోతాయని తెలుస్తుంది. ఈ ‘మిర్చి’ (Mirchi) తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమాల్లో ఎక్కువ డాన్స్ మూమెంట్స్ లేవు. ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) లో దిశా పటానితో (Disha Patani) వచ్చే సాంగ్లో కొంచెం డాన్స్ చేశాడు. అలాగే ప్రభాస్ నుండి కమర్షియల్ ఆల్బమ్ వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. ఆ లోటుని ‘ది రాజాసాబ్’ తీరుస్తుంది తమన్ ముందు నుండి కాన్ఫిడెంట్ గా చెబుతున్న సంగతి తెలిసిందే.

ఐఫా కాంట్రోవర్సీపై తేజ సజ్జ క్లారిటీ..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.