April 1, 202501:08:54 AM

Ramayana: రణబీర్ – సాయి పల్లవి రామాయణ.. రిలీజ్ డేట్ ఫిక్స్

హిందీ సినిమా ప్రేమికులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘రామాయణ’. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్నారు. మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ‘రామాయణ’లో (Ramayana) శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కనిపించనుండగా, సీత పాత్రలో టాలెంటెడ్ నటి సాయి పల్లవి (Sai Pallavi)  నటించనున్నారు. రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ (Yash)  ఉండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Ramayana

ఇక సినిమాలో హనుమంతుడి పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ (Sunny De0l) పోషిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా (Lara Dutta) , సూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) , హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 దీపావళికి విడుదల చేయనున్నారు, రెండవ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఫీషియల్ గా మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల ఈవెంట్ లో హీరో రణబీర్ కపూర్ మాట్లాడుతూ, శ్రీరాముడి పాత్ర కోసం ప్రత్యేకంగా మద్యం మానేసినట్లు, కఠినమైన డైట్ ఫాలో అవుతున్నట్లు వెల్లడించారు. తన కెరీర్‌లో అత్యంత పవిత్రమైన పాత్ర ఇది అంటూ, ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సీత పాత్ర పోషించే సాయి పల్లవి కూడా ఈ పాత్ర పట్ల తనకున్న ప్రణాళికను వ్యక్తపరుస్తూ, సీతమ్మగా నటించడం తనకు ఎంతో గొప్ప అనుభూతి అని చెప్పింది.

సాయి పల్లవి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి రామాయణం (Ramayana) కథ వింటూ పెరిగానని, అందులో భాగం కావడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపింది. అలాగే అలాంటి పాత్ర చేయడం తనకు అదృష్టంగా ఉందని, ఈ సినిమాలో నటిగా కాకుండా ఆ పాత్రలో తాను పూర్తిగా మమేకం అవుతానని చెప్పింది. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) డైలాగ్స్ రాయబోతున్నట్లు సమాచారం.

సమంత కొత్త వెబ్‌సిరీస్‌.. జనాలు తెల్లార్లూ కూర్చోవాల్సిందేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.