March 22, 202502:27:05 AM

Spirit: సందీప్ రెడ్డి వంగా ఓపెన్ అయినట్టేగా.. వీడియో వైరల్!

ప్రభాస్ (Prabhas)  ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఓ పక్క మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  సినిమా చేస్తూనే మరోపక్క హను రాఘవపూడి  (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నాడు. ఛాన్స్ ఉంటే ‘సలార్ 2’ (Salaar) కూడా కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోపక్క సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి 3 ఏళ్లు దాటింది.

Spirit

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా మరో సినిమా పనులు పెట్టుకోకుండా ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులపైనే దృష్టి పెట్టాడు. నటీనటుల ఎంపిక ముమ్మరంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ డబుల్ రోల్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ అని తెలుస్తుంది. ఇద్దరు హీరోయిన్లు కూడా కథ ప్రకారం కావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. హాలీవుడ్ నటుడు డాన్లీ ‘స్పిరిట్’ లో నటిస్తున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అతను తన సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేసి అందరిలో ఆసక్తి పెంచాడు. దీనిపై చిత్ర బృందం నుండి ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో డాన్ లీ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగాకి ప్రశ్న ఎదురైంది. దీనిపై అతను స్పందించాడు.

‘2025 జనవరి నెలలో ‘స్పిరిట్’ కి సంబంధించి అన్ని వివరాలు తెలియజేస్తాను. మీరు అడుగుతున్న దానికి సంబంధించి కూడా’ అంటూ సమాధానం ఇచ్చాడు. సందీప్ మాటల్ని బట్టి.. డాన్ లీ అసత్య ప్రచారం అయితే అతను ‘ఫేక్’ అని చెప్పవచ్చు. కానీ త్వరలోనే అధికారికంగా చెబుతాను అన్నట్టు సందీప్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.

కంగువా.. విలన్ రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.