March 20, 202508:07:44 PM

Star Heroes: ఒకే ఫ్రేమ్ లో ఐదుగురు హీరోలు.. వ్వాటే క్లిక్!

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఐదుగురు హీరోలు (Star Heroes) ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అంటే ఫ్యాన్స్‌కు నిజంగా పండగే. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , కింగ్ నాగార్జున (Nagarjuna), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , యంగ్ హీరో అఖిల్ (Akhil) ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. వారి పక్కన మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) , రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన కూడా ఉన్నారు. వారందరూ ఒక రెస్టారెంట్‌లో కలిసి ఆనందంగా లంచ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

Star Heroes

ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. సామాన్యంగా ఒకరి పక్కన ఒకరు కనిపించినా సంతోషం, అలాంటిది ఐదుగురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో ఉండటం కలిసి వచ్చిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఈ ఫోటో చూస్తుంటే మనకు కన్నుల పండుగగా అనిపిస్తుంది’’ అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఫోటోను అందరూ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఇంత మంది హీరోలు ఒకే చోట ఎందుకు కలిశారనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం కూడా త్వరగానే లభించింది.

ప్రముఖ వ్యాపారవేత్త, గ్రీన్ కో సంస్థ ఎండీ అనిల్ కుమార్ చలమలశెట్టికి చెందిన బర్త్‌డే వేడుకల్లో వీరు మాల్దీవ్స్‌లో కలిసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే మహేష్ బాబు అనిల్ కుమార్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీని తరువాత బీచ్‌లో మహేష్ దంపతుల ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ సందర్భంగా ఆ బర్త్‌డే పార్టీలో టాలీవుడ్ స్టార్లు (Star Heroes) ఐదుగురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అదృష్టమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ప్రత్యేక సందర్భం ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే, వారు అందరూ తారలే కావడం వల్ల, వారి అభిమానులు ఒక్క ఫోటో చూసి ఎంతో ఆనందం పొందారు. వారంతా తమ కెరీర్‌లో తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, ఈసందర్భంగా కలిసి కనిపించడం నిజంగా ప్రత్యేకం. చిరంజీవి ‘విశ్వంభర’లో (Vishwambhara), నాగార్జున ‘కుబేర’తో, మహేష్ బాబు రాజమౌళి (S. S. Rajamouli) ప్రాజెక్ట్‌తో, రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) తో, అఖిల్ కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

సూర్యతో సినిమా మిస్ అయ్యింది.. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి!

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.