March 20, 202505:05:36 PM

Thaman: అతన్ని ఇండియన్‌ ఐడల్‌లోకి తీసుకోండి.. ఇది నా ఆర్డర్‌ అంటూ తమన్‌ పోస్ట్‌!

సింగింగ్‌ షోల్లో మనకు చాలా మంది సింగర్స్‌ కనిపిస్తుంటారు. అందులో బాగా శిక్షణ తీసుకొని వచ్చేవాళ్లూ ఉంటారు. పెద్దగా శిక్షణ తీసుకోకుండా వచ్చి రాణించిన వాళ్లూ ఉంటారు. అయితే ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్న / అయిన ఇండియన్‌ ఐడల్‌ షో కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కేవలం ఇప్పుడు సంగీతంలో శిక్షణ తీసుకుంటున్న వాళ్లే కాక.. వైవిధ్యమైన నేపథ్యం, పరిస్థితుల్లో ఉన్నవాళ్లు వస్తుంటారు. అలా త్వరలో ప్రారంభం కానున్న ఇండియన ఐడల్‌ తెలుగు నాలుగో సీజన్‌ కోసం ఓ కంటెస్టెంట్‌ రెడీ అయ్యారు.

Thaman

ఆయన్ని సెలక్ట్‌ చేసింది ఆ షో జడ్జిల్లో ఒకరైన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman). ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అందులో ఓ దివ్యాంగ గాయకుడు పాట పాడుతూ కనిపించాడు. అతని పేరు రాజు. బ్లైండ్‌ సింగర్‌ రాజుగా ఆయన సోషల్‌ మీడియాలో ఇప్పటికే పరిచయం కూడా.గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఆయన ఇంటర్వ్యూలు, పాటలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అందులో ఓ వీడియో క్లిప్‌ను తమన్‌కు అతని ఫ్యాన్స్‌ ఎక్స్‌ (మాజీ ట్విటర్‌) ద్వారా పంపించారు.

దానిని చూసిన తమన్‌ రియాక్ట్‌ అవుతూ ఈయన్ని తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 4లోకి తీసుకోండి. దీనిని నా రిక్వెస్ట్‌గాను, ఆర్డర్‌గానూ తీసుకోండి అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు తమన్‌.అంతేకాదు ఇండియన్‌ ఐడల్‌ వేదిక మీద రాజుతో ఓ స్పెషల్‌ పర్‌ఫార్మెన్స్‌ ఉంటుంది అని, తాను కూడా అతనితో కలసి ఆ ప్రదర్శనలో పాల్గొంటాను అని రాసుకొచ్చారు తమన్‌. ఈ క్రమంలో రాజు టాలెంట్‌ను పొగిడేశారు తమన్‌. ఆ ప్రతిబ, పిచ్చింగ్‌ అదిరిపోయాయని అన్నారు.

దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడని, అయితే మనం మనుషులం కాబట్టి ఇలాంటి వారి విషయంలో స్పెషల్‌గా ఉండాలి అని కోరాడు. ఈ ఈ విషయంలో మీ సాయం కావాలి అంటూ తన ఫ్యాన్‌ గ్రూప్‌ను, ఆహా ఎక్స్‌ ఖాతాలను ట్యాగ్‌ చేశాడు. కొన్ని రోజుల క్రితం రాజుకు అవకాశం ఇవ్వండి అని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి (M. M. Keeravani) ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు. ఆయన కూడా ఓకే అన్నారని సమాచారం. ఇప్పుడు తమన్‌ కూడా రియాక్ట్‌ అయ్యారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.