March 31, 202510:11:54 AM

Varun Tej: వరుణ్‌ దగ్గరకు ముందే ఆ రెండు హిట్‌ కథలు వచ్చాయట.. కానీ అలా మిస్‌!

ఎవరికి రాసి ఉన్న సినిమా వారి దగ్గరకు చేరుతుంది అని అంటుంటారు టాలీవుడ్‌లో. అలాగే తన కథ తన వరకు వచ్చినప్పుడు ఒడిసిపట్టుకోవాలి అని కూడా అంటుంటారు. మరీ తన కథ తన దగ్గరకు రాలేదు కానీ.. మంచి విజయాలు అందుకున్న రెండు కథలను ముందే వినినా వరుణ్‌ తేజ్‌ (Varun Tej)  పట్టుకోలేకపోయాడా? అవుననే అనిపిస్తోంది ఆయన కామెంట్లు చూస్తుంటే. ఆయన వినిన కథల లిస్ట్‌లో ‘సార్‌’ (Sir) , ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) ఉన్నాయి మరి.

Varun Tej

‘లక్కీ భాస్కర్‌’ సినిమాతో తన మీద ‘ఓవర్సీస్‌ ప్రేమ కథల దర్శకుడు’ అనే ముద్రను బలంగా చెరిపేసుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. దుల్కర్‌ సల్మాన్‌  (Dulquer Salmaan)  నటించిన ఆ సినిమా ఇటీవల దీపావళి సందర్భంగా విడుదలై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమా ఏమవ్వొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఆ కథ వరుణ్‌తేజ్‌కి తెలిసి ఉంటుంది అనేది లేటెస్ట్‌ టాక్‌.

ఎందుకంటే.. వెంకీ అట్లూరి (Venky Atluri)  రీసెంట్‌గా చేసిన రెండు సినిమాలు ‘సార్‌’, ‘లక్కీ భాస్కర్‌’ కథల్ని వరుణ్‌ తేజ్‌ విన్నాడట. ‘తొలిప్రేమ’ (Tholi Prema) సినిమా చేస్తున్నప్పుడు వరుణ్‌, వెంకీకి మంచి అనుబంధం ఏర్పడిందట. ఆ తర్వాతి నుండి వెంకీ ఏ కథ రాసుకున్నా.. వరుణ్‌కి చెబుతూ వచ్చారట. అలా ‘సార్‌’, ‘లక్కీ భాస్కర్‌’ కూడా చెప్పారట. ‘లక్కీ భాస్కర్’ కథ చెప్పినప్పుడు బాగా అనిపించిందని, ‘సార్’ సినిమా చేయాలని తనకు ఉండేదని వరుణ్‌ చెప్పాడు.

అయితే అప్పటికే ధనుష్‌తో (Dhanush) ఆ సినిమా చేయాలని వెంకీ అట్లూరి ఫిక్స్ అయ్యారని అందుకే ఆ ప్రాజెక్ట్‌ కుదర్లేదని వరుణ్‌ (Varun Tej) చెప్పాడు. అయితే భవిష్యత్తులో తప్పకుండా వెంకీతో సినిమా చేస్తానని వరుణ్ క్లారిటీ ఇచ్చేశాడు. తర్వాతి సినిమా గురించి చెబుతూ.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్న సినిమా కామెడీ హారర్ జోనర్‌లో ఉంటుందని తెలిపారు. అలాగే నిహారిక నిర్మాణంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

చిరంజీవి కథ.. చిరంజీవికే చెప్పి.. నో అంటే నితిన్‌ ఓకే అన్నాడా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.