March 24, 202509:05:36 AM

Varun Tej: పారితోషికం విషయంలో తగ్గేదే లేదంటున్న వరుణ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) .. వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ‘గని’ (Ghani) ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna)  ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine)  ‘మట్కా’ (Matka) వంటి సినిమాలు వరుణ్ తేజ్ ని రేసులో వెనుక పడేలా చేశాయి. ‘మట్కా’ సినిమాకి అయితే మొదటి రోజు నుండే షోలు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరోపక్క ఈ 4 సినిమాలకి చూసుకుంటే కరెక్ట్ గా రూ.10 కోట్ల షేర్ కూడా రాలేదు. థియేటర్లలో ఇవి పెద్ద డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. నిర్మాతలకి ఎంతవరకు మిగిలిందో అది వాళ్ళకే తెలియాలి.

Varun Tej

అయితే ఇన్ని డిజాస్టర్లు పడినా వరుణ్ తేజ్ పారితోషికం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు అని ఇన్సైడ్ టాక్. హిట్టు ప్లాప్ అనే తేడా లేకుండా.. తాను అడిగినంత ఇస్తేనే సినిమాలకు సైన్ చేస్తాను అని తెగేసి చెబుతున్నాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. వరుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట.

‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా ప్రమోషన్స్ టైంలో ‘ప్రయోగాలు చేస్తున్నప్పుడు రిస్క్ ఉందని తెలిస్తే తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం.. లేదంటే సగమే తీసుకోవడం వంటివి చేస్తున్నాను ‘ అంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు రూ.7 కోట్లకి తక్కువ తీసుకునేది లేదని చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ‘కొరియా కనకరాజు’ అనే సినిమా చేస్తున్నాడు.

‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దీనికి వరుణ్ తేజ్ రూ.7 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నాడట. ఆ తర్వాత విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి వరుణ్ తేజ్ రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మళ్లీ ప్రభాస్ పేరెత్తిన లేడీ పొలిటీషియన్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.