March 25, 202511:37:12 AM

YVS Chowdary: అందరి పర్మిషన్ తీసుకున్నాను.. మీకెందుకు చెప్పాలి : వైవిఎస్ చౌదరి

‘రేయ్’ (Rey) తర్వాత దాదాపు 9 ఏళ్ళు గ్యాప్ తీసుకుని వైవీఎస్ చౌదరి (YVS Chowdary)  ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ‘న్యూ టాలెంట్ రోర్స్’ అనే బ్యానర్ ను స్థాపించి తన భార్య గీతని నిర్మాతగా పెట్టారు. కొంతమంది ఎన్నారై..లు ఫైనాన్స్ చేయడం వల్ల ఆమె నిర్మాతగా మారారు అని సమాచారం. ఆ విషయాన్ని పక్కన పెడితే.. తన కొత్త బ్యానర్ పై కూడా ఇదివరకటిలా కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తానని వైవీఎస్ చౌదరి చెప్పారు.

YVS Chowdary

ఈ క్రమంలో మొదటి సినిమాని దివంగత నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna)  మనవడు, దివంగత నందమూరి జానకీ రామ్ (Janaki Ram Nandamuri)  మనవడు అయినటువంటి నందమూరి తారక రామారావుతో చేయబోతున్నాడు. ఇంకో రకంగా సీనియర్ ఎన్టీఆర్ (N .T. Rama Rao)  మునిమనవడితో చేయబోతున్నాడు అని చెప్పాలి. సో వైవీఎస్ కి ఇది చెప్పుకోదగ్గ అవకాశమే. గతంలో అతను ఆదిత్య ఓం, అంకిత (Ankitha)  వంటి వాళ్ళని పరిచయం చేశాడు. వాళ్ళు బాగా క్లిక్ అయ్యారు. తర్వాత రామ్ (Ram) – ఇలియానా (Ileana) ..లని పరిచయం చేశాడు. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) డెబ్యూ కూడా వైవీఎస్ చేతుల మీదుగానే జరిగింది.

కానీ ‘రేయ్’ రెండో సినిమాగా రిలీజ్ అయ్యింది. ఏదేమైనా వాళ్ళు స్టార్లు అయ్యారు. సో సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడికి ఇది మంచి ఛాన్స్. పైగా జానకీ రామ్ ఫ్యామిలీకి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), ఎన్టీఆర్ (Jr NTR) ..ల సపోర్ట్ కూడా ఉంది. రామారావు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..లు ట్వీట్లు వేశారు. కానీ వాళ్ళ సపోర్ట్ ఉంది అని వైవీఎస్ మాత్రం చెప్పుకోవట్లేదు. దీని గురించి ప్రశ్నిస్తే మీకు ఎందుకు చెప్పాలి అంటున్నాడు.

‘మీరు నేరుగా అడిగినా నేను వంకరగానే సమాధానం ఇస్తాను’ అంటూ వైవిఎస్ సమాధానం చెబుతుండటం గమనార్హం. దీనికి రెండు కారణాలు అయ్యుండొచ్చు. ఒకటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..ల మద్దతు ఉంది అని చెబితే వైవిఎస్ సినిమా బాగా తీసినా క్రెడిట్ ఎక్కువ శాతం వాళ్ళకే వెళ్ళిపోతుంది. అది కాదు అనుకుంటే.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్…ల కంటే బాలకృష్ణతో వైవిఎస్ కి సాన్నిహిత్యం ఎక్కువ.

ఇప్పుడు బాలయ్యకి (Nandamuri Balakrishna) ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్  ..లకు గ్యాప్ వచ్చింది కాబట్టి.. వైవిఎస్ వాళ్ళ పేర్లు ప్రస్తావించడం లేదు అనుకోవాలి. వీటిలో కారణం ఏదైనా… అవి వైవీఎస్ రివీల్ చేసే అవకాశాలు లేకపోలేదు. కానీ జానకిరామ్ కొడుకు రామారావు మొదటి సినిమాకి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..ల సపోర్ట్ అయితే అవసరం. అప్పుడే వాళ్ళ ఫ్యాన్స్ థియేటర్లకు వస్తారు.

 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.