March 26, 202507:29:23 AM

‘పీపుల్ మీడియా’ వాళ్ళ 2 డేట్లు ‘యూవీ’ వాళ్ళు లాగేసుకుంటున్నారా?

‘యూవీ క్రియేషన్స్’ లో ‘విశ్వంభర’ (Vishwambhara) రూపొందుతుంది. వాస్తవానికి ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల.. ఆ డేట్ కి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వస్తుంది. ఇక ‘విశ్వంభర’ ని సమ్మర్ కానుకగా మే 9 కి రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఫస్ట్ కాపీ మార్చి ఎండింగ్ కి రెడీ అయిపోతుంది అని భావించి ఇంకాస్త.. ముందుగా రిలీజ్ చేయాలని యూవీ వారు భావిస్తున్నారు.

The Rajasaab

ఈ క్రమంలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమా వీఎఫెక్స్ వల్ల డిలే అవుతుంది అని తెలుసుకుని.. ఏప్రిల్ 10 కి ‘విశ్వంభర’ ని తీసుకురావాలని భావిస్తున్నారు. అంతే కాదు ఇదే బ్యానర్లో ఏప్రిల్ 18 కి ‘మిరాయ్’ (Mirai) రావాలి. ఇప్పుడు ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. దీంతో ఆ డేట్ కి అనుష్క(Anushka Shetty)  ‘గాటి’ (Ghaati)  చిత్రాన్ని విడుదల చేస్తున్నారు యూవీ వారు. క్రిష్ (Krish Jagarlamudi)  డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా (The Rajasaab) షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది.

జనవరి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. సో ఇది కూడా సమ్మర్ కి రెడీ అయిపోతుంది. అందుకే ఏప్రిల్ 18 ని ఫైనల్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. చూస్తుంటే ‘పీపుల్ మీడియా’ వారు లాక్ చేసుకున్న రెండు డేట్లను ‘యూవీ’ సంస్థ లాగేసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే అధికారిక ప్రకటన వస్తేనే తప్ప దీనిపై ఒక క్లారిటీ అయితే రాదు అనే చెప్పాలి.

కన్నప్పలో ప్రభాస్ సీన్స్..40 నిమిషాలు అనుకుంటే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.