అక్కినేని అఖిల్‌కు (Akhil Akkineni) “ఏజెంట్” (Agent) ఫలితం తర్వాత కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టడం పెద్ద సవాలుగా మారింది. అతని కెరీర్‌లో ఆ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలవడం, ఆ తరువాత ప్రాజెక్ట్‌ల విషయంలో పెద్ద గ్యాప్ రావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ గ్యాప్‌లో మంచి స్క్రిప్ట్ కోసం కష్టపడిన అఖిల్, తన తదుపరి సినిమాను హోమ్ బ్యానర్‌లో ప్లాన్ చేసుకున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరుతో అఖిల్ చేస్తోన్న కొత్త సినిమా గురించి చర్చలు వేగంగా సాగుతున్నాయి.
Akhil
చిత్తూరు నేపథ్యంలో పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోందట. ఈ ప్రాజెక్ట్‌ను మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నాగార్జున (Nagarjuna) , నాగ చైతన్య (Naga Chaitanya) కలిసి నిర్మించబోతున్నారు. షూటింగ్ 2025 ప్రారంభంలో ప్రారంభమవుతుందని సమాచారం. కథకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆమె ప్రాజెక్ట్‌కు భారీ బజ్ తీసుకురాగలగడం, మార్కెట్‌లో మంచి క్రేజ్ కలిగి ఉండడం ప్లస్ పాయింట్స్‌గా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాలో భాగస్వామిగా ఉంటుందని టాక్. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల వరుస విజయాలు సాధించడంతో, అఖిల్ సినిమాకు వ్యాపార పరంగా ఇది మేలని నాగార్జున భావించారట. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రమోషన్స్ విషయంలో చాలా స్ట్రాటజిక్‌గా వ్యవహరించే సంస్థ.
సినిమాను ప్రేక్షకుల దృష్టికి బలంగా తీసుకెళ్లడంలో, బిజినెస్ పరంగా ప్లాన్ చేయడంలో వీరి సమర్థత తెలిసిందే. నాగవంశీతో కలిసి పని చేయడం, ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని అందించనుంది. మురళీ కిషోర్ అబ్బూరు, “వినరో భాగ్యము విష్ణు కథ” (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత, అఖిల్‌తో రెండో ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం విశేషం. అఖిల్ ఈ సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది వేచి చూడాలి.