March 20, 202510:55:40 PM

Allu Arjun: ‘బిగ్ బాస్ 8’ ఫినాలేకి అల్లు అర్జున్.. నిజమెంత?

బిగ్ బాస్ 8 చివరి దశకు వచ్చింది. వచ్చే ఆదివారం.. అంటే డిసెంబర్ 15న ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ సెలబ్రేషన్స్ ని ఎప్పుడూ గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉంటారు. ఈ 8వ సీజన్ విషయంలో కూడా అంటే గ్రాండ్ గా ఉండాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టాప్ 5 లో నబీల్ (Nabeel Afridi), నిఖిల్ (Nikhil) , అవినాష్ (Avinash) , ప్రేరణ (Prerana), గౌతమ్..లు ఉన్నారు. వీళ్లలో ఎవరు విన్నర్ అవుతారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

Allu Arjun

ఇదిలా ఉండగా.. ఫినాలే ఎపిసోడ్ కి ప్రతిసారి ఓ పెద్ద హీరో హాజరవ్వడం ఆనవాయితీగా వస్తోంది.నాగార్జున హోస్టింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు.. అంటే సీజన్ 3 , సీజన్ 4 ..లకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చేవారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కూడా ఆయన చాలా గొప్పగా మాట్లాడేవారు. అలాగే దివి వంటి కంటెస్టెంట్స్ కి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తానని చెప్పారు. చెప్పినట్టే ‘గాడ్ ఫాదర్’ (Godfather) లో ఛాన్స్ ఇప్పించారు.

ఇక నాగార్జునతో (Nagarjuna) చిరంజీవి (Chiranjeevi) స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత చిరు బిజీగా ఉండటం వల్ల వేరే హీరోలు లేదా డైరెక్టర్లు ఫినాలే ఎపిసోడ్ కి రావడం మనం చూశాం. ఇక సీజన్ 8 ఫినాలే కోసం అల్లు అర్జున్ (Allu Arjun)  గెస్ట్ గా హాజరుకాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అల్లు అర్జున్ చేతుల మీదుగా విజేతకి ట్రోఫీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ‘పుష్ప 2′(Pushpa 2: The Rule) శాటిలైట్ హక్కులు ‘స్టార్ మా’ వారు దక్కించుకున్నారు. కాబట్టి.. ‘బిగ్ బాస్ 8’ ఫినాలేకి వచ్చి ‘పుష్ప 2’ ని అల్లు అర్జున్ మరింతగా ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.