March 20, 202506:20:41 PM

Allu Arjun: తమిళ, మలయాళం వాళ్లకు ఉన్న లక్ తెలుగోళ్లకి లేదా?

అల్లు అర్జున్ (Allu Arjun)  “పుష్ప2” (Pushpa 2: The Rule)  రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియా మొత్తం ఒక రౌండ్ వేసిన విషయం తెలిసిందే. పట్నాలో మొదలైన పుష్ప హంగామా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ తో ముగిసింది. అయితే.. వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక స్పెషల్ ముమెంట్ క్రియేట్ చేశాడు బన్నీ. ముఖ్యంగా చెన్నైలో ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన బన్నీ, కొచ్చి ఈవెంట్లో కేరళ ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా “పీలింగ్స్” పాట గ్లింప్స్ ను రిలీజ్ చేయడమే కాక..

Allu Arjun

ప్రతి భాషలోనూ మలయాళం లిరిక్స్ ఉంటాయని చెప్తూ ఆ పాటను కేరళ ప్రేక్షకులకు డెడికేట్ చేశాడు. ఇక ముంబై ఈవెంట్లో అయితే ఏకంగా రష్మిక మందన్నతో (Rashmika Mandanna) కలిసి “సూసేకి” పాటకు డ్యాన్స్ వేసి హిందీ మీడియాను మంత్రముగ్ధుల్ని చేశాడు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఇలాంటిదేదో స్పెషల్ మూమెంట్ ఉంటుంది అనుకున్నారు ఫ్యాన్స్. కానీ.. ఎలాంటి డ్యాన్స్ లేదా డైలాగ్ లేకుండా అందరికీ థ్యాంక్స్ చెప్పేసి ముగించేసాడు బన్నీ.

దాంతో అన్నీ భాషలవాళ్ళకి అన్ని స్పెషల్ మూమెంట్స్ ఇచ్చి తెలుగోళ్లకి మాత్రం ఏమీ ఇవ్వలేదని అభిమానులు కాస్త బాధపడ్డారు. అయితే.. నిన్న ఈవెంట్ మొదలవ్వడమే 8 అయిపోగా, పూర్తయ్యేసరికి 11 దాటింది. దాంతో సుకుమార్ కూడా తాను చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పలేకపోయాడు. అలాంటి తరుణంలో బన్నీ డ్యాన్స్ గట్రా చేయడం అంటే కష్టమే అనుకోండి. కానీ.. ఒకవేళ చేసి ఉంటే మాత్రం భలే హైలైట్ అయ్యేది.

ఇకపోతే.. ఇవాళ ప్రీమియర్స్ టికెట్ బుకింగ్స్ కాసేపట్లో ఓపెన్ అవ్వనున్నాయి. ఆంధ్రాలో 944 రూపాయలు మరియు తెలంగాణలో 1239 రూపాయలకు లభ్యం కానున్న ఈ టికెట్ బుకింగ్స్ అన్నీ కేవలం సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.

ఆ ఎపిసోడ్ మొత్తం మాస్ ఆడియన్స్ కి, నార్త్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అట!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.