March 20, 202510:34:35 PM

Allu Arjun: మైత్రీ నిర్మాతలకు తలనొప్పి.. అంత రేటు ఏంటి అంటూ డైరెక్ట్‌గా అడిగిన ఫ్యాన్‌!

Allu Arjun Fans Questions To Pushpa 2 Producer On Stage1

అంటే అన్నామని బాధపడతారు కానీ.. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ రేట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించినప్పుడు సినిమా నిర్మాతలు గగ్గోలు పెట్టారు. ఈ ధరలతో సినిమా తీయలేం బాబోయ్‌ అని అన్నారు. అప్పటి ప్రభుత్వం పెట్టిన ధరలు మరీ ఇబ్బందికరంగా ఉన్న విషయం కరెక్టే కానీ.. ఇప్పటి ప్రభుత్వాలు పెట్టిన ధరలు ఇంకా దారుణం. సగటు సినిమా ప్రేక్షకుడి కుటుంబం సినిమాకు వెళ్లాలి అంటే భయపడిపోయే ధరలు ఇప్పుడు పెడుతున్నారు, పెట్టారు కూడా.

Allu Arjun

ఇదంతా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. సినిమా టికెట్‌ ధరల గురించి అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులు కూడా బాధపడుతున్నారు అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరికైనా డౌట్‌ ఉంటే.. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఇది ఎక్కడో, ఎవరో అన్నది కాదు. ‘పుష్ప: ది రూల్‌’ హైదరాబాద్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనిది. ‘పుష్ప 2’ పెయిడ్ ప్రీమియర్లకు టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా తెలంగాణలో రూ. 800 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది.

ఏపీలో అయితే రూ. 800 వరకు పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చారు. దీంతో టికెట్‌ రేట్లు తడిసి మోపెడు అయ్యాడు. ఇక ఆ రేటు టికెట్‌ బ్లాకులో కొనాలంటే ఇంకెంత కష్టమో మీకూ తెలుసు. ఈ బాధతోనే ఓ అభిమాని నిన్న ఈవెంట్‌లో నిర్మాతలు మాట్లాడుతున్నప్పుడు ‘మరీ రూ. 1200 ఏంటి సార్?’ అని అడిగేశాడు. అయితే ఈ మాటకు ఓ నిర్మాత రవి  (Y. Ravi Shankar) నవ్వేయగా, నవీన్‌ (Naveen Yerneni) ఏమీ తెలియదు అన్నట్లు ఉండిపోయారు.

ఆ అభిమాని ఎవరో అడిగారని కాదు కానీ.. మీరు చెప్పండి అంతేసి టికెట్‌ రేట్లు ఎందుకు పెట్టడం. సినిమాకు ఎక్కువ ఖర్చు పెట్టేశాం.. అంతా రావాలి కదా అని అనొచ్చు. ఈ మాటకే చాలా పాత రిప్లై ఒకటి ఉంది. అంత ఎవరు పెట్టమన్నారు.. మా దగ్గర నుండి ఇంత ఎవరు లాగమంటున్నారు అని. దీనికైతే నిర్మాతలు ఆన్సర్లు చెప్పాల్సిందే.

టిక్కెట్ రేట్లు.. గేమ్ ఛేంజర్ కు అడిగేంత సీనుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.