March 28, 202502:32:01 PM

Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ ప్లాన్ ఏంటీ?

పుష్ప-2 (Pushpa 2: The Rule)  విడుదలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  కెరీర్ మరో లెవెల్ కు చేరుకుంది. సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్ భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి హిందీ బెల్ట్ వరకూ ప్రతీ చోటా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్స్ మార్క్ చేరుకుని అద్భుతమైన వసూళ్లు సాధించింది. అయితే, పుష్ప-2 విజయానంతరం అల్లు అర్జున్ తదుపరి ప్లాన్‌పై అందరి దృష్టి పడింది.

Allu Arjun

Allu Arjun

బన్నీ ప్రస్తుత ఫోకస్, పుష్ప-2 సక్సెస్ ఫుల్ ప్రమోషన్లపైనే ఉందని తెలుస్తోంది. విడుదలకు ముందే భారీ ప్రొమోషన్ ప్లాన్ చేసిన బన్నీ టీం, విడుదల తర్వాత కూడా ఆ హైప్ కొనసాగించడానికి ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రెస్ మీట్‌లను ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ఈ సక్సెస్ సెలబ్రేషన్లలో చిన్న ఆటంకంగా మారింది.

ఆ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ కారణంగా పోలీసులు అల్లు అర్జున్‌ను విచారణకు పిలవడం, కోర్టు రిమాండ్ విధించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి విడుదల చేసినప్పటికీ, ఈ కేసు ఇంకా పూర్తిగా ముగియలేదు. అయితే బన్నీ, పుష్ప-2 సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ పూర్తి చేసి, తరువాత కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.

వీటితో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇది పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కే మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. మరోవైపు, అల్లు అర్జున్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని తన ఫ్యామిలీ తో కూడా సమయం కేటాయించనున్నారు. ఇక ప్రాజెక్టుల విషయంలో బన్నీ తదుపరి అడుగులపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అల్లరి నరేష్ ఈసారైనా హిట్టు కొడతాడా..?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.