April 1, 202501:55:24 AM

Allu Arjun: బన్నీ ఇంటి వద్ద మరో హడావుడి.. రెండు గంటల్లోనే ఊహించని ట్విస్ట్!

Unexpected Twists at Allu Arjun Residence Media Frenzy (1)

అల్లు అర్జున్ (Allu Arjun)  సంధ్య థియేటర్ ఘటన కారణంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప 2  (Pushpa 2: The Rule)  సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఆ ఘటన తీరని చర్చలకు దారితీశాయి. ఆ ఘటనపై జరిగిన విచారణలో భాగంగా బన్నీ పోలీసుల ముందు హాజరవడంతో, అతని ఇంటి వద్ద మళ్ళీ మీడియా హడావుడి మొదలైంది. ఇది తారస్థాయికి చేరడంతో ఇంటి భద్రతను పెంచే ప్రయత్నాలు చేసారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు కట్టించడం ఒక్కసారిగా వివాదానికి దారి తీసింది.

Allu Arjun

Unexpected Twists at Allu Arjun Residence Media Frenzy (1)

ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలను మీడియా ప్రదర్శించకుండా ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే, ఈ నిర్ణయం విమర్శలకు గురి కావడం విశేషం. పరదాలు కట్టడం అనైతికమని, అభిమానులకు, మీడియాకు అవమానంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శల దృష్ట్యా, రెండు గంటల వ్యవధిలోనే పరదాలను తొలగించారు.

These questions will be asked to Allu Arjun during the enquiry (1)

పరదాలను తొలగించిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటి వద్ద మీడియా వాతావరణం మరింత హోరెత్తింది. ఇంటి ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొందరు అభిమానులు కూడా చేరుకున్నారు. రాత్రి నుంచే ఊహించని హడావుడి కనిపించడం మొదలై, పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో, భద్రతా కారణాలతో తీసుకున్న నిర్ణయం వివాదస్పదంగా మారింది.

Allu Arjun warns fake accounts misusing his name1

సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపించిందని అనిపిస్తోంది. బెనిఫిట్ షోలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం, టికెట్ రేట్ల పెంపు పైన నిషేధం ప్రకటించడం ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడింది. ఈ చర్యలు ఆర్థిక పరంగా పరిశ్రమపై భారం పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.