March 20, 202511:37:01 AM

Atlee: అట్లీ – బన్నీ.. ఏం మాట్లాడుకున్నారు?

Atlee reacts to Baby John facing tough competition from Pushpa 2 (1)

పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న “పుష్ప 2” (Pushpa 2: The Rule)  దూకుడుకు మరో సినిమా ఎదురులేకపోవడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun)  నటనతోనే సాలీడ్ క్రేజ్ అందుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువలో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్‌లోనే 600 కోట్ల దిశగా రాణించడం “పుష్ప 2” విజయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇలాంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌కు పోటీగా త్వరలో విడుదలకానున్న చిత్రం “బేబిజాన్ (Baby John).”

Atlee:

Atlee reacts to Baby John facing tough competition from Pushpa 2 (1)

వరుణ్ ధావన్ (Varun Dhawan ) , కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కలీస్ దర్శకత్వం వహించగా, అట్లీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అట్లీ (Atlee Kumar)  గతంలో తీసిన “జవాన్” (Jawan) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంతో “బేబిజాన్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో, “పుష్ప 2” విజయానికి ఈ సినిమా ముప్పుగా మారుతుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు అట్లీ స్పందిస్తూ, “పుష్ప 2″కి తమ సినిమా పోటీగా నిలవదని స్పష్టం చేశారు.

“బన్నీ నేను (Atlee) మంచి స్నేహితులం. “పుష్ప 2″ డిసెంబర్ ప్రారంభంలో వచ్చింది. మా సినిమా నాల్గవ వారంలో వస్తోంది. ఇది పోటీగా ఎలా మారుతుంది? అన్నది గుర్తించాలి. బన్నీ గారు స్వయంగా ఫోన్ చేసి మా టీంకు బెస్ట్ విషెస్ చెప్పారు. పాజిటివ్ అప్రోచ్‌తో ఇద్దరం ఉన్నాం” అని అట్లీ తెలిపారు. మరోవైపు, “పుష్ప 2” నాలుగో వారానికి చేరుకున్నప్పటికీ, అది ఇప్పటికీ థియేటర్లలో తన ప్రభావం చూపుతుండడం గమనార్హం.

“బేబిజాన్” తనకంటూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకోవాలంటే, ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రావాల్సిందే. అట్లీ నెక్స్ట్ సినిమాపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఇక, బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమా “ఛావా” విడుదల వాయిదా పడటంతో “బేబిజాన్”కి మరింత ఫెవరబుల్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. “పుష్ప 2” ఇంకా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుండగా, “బేబిజాన్” తన మార్కును సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.