Baby John Review in Telugu: బేబీ జాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Baby John Movie Review and Rating1

“కందిరీగ” రీమేక్ తో సోలో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన వరుణ్ ధావన్ నటించిన మరో రీమేక్ సినిమా “బేబీ జాన్”. విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన “తెరీ” (2016)కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి కలీస్ దర్శకుడు. కీర్తి సురేష్ అఫీషియల్ బాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ విలన్ గా నటించగా.. వామిక గబ్బి మరో ముఖ్య పాత్ర పోషించింది. మరి ఈ తమిళ రీమేక్ హిందీ ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!!

Baby John Review

కథ: ఒక్కగానొక్క కూతురు ఖుషీ (జరా)తో కలిసి కేరళలోని ఓ మారుమూల గ్రామంలో ఓ బేకరీ నడుపుకుంటూ సంతోషంగా బ్రతికేస్తుంటాడు జాన్ అలియాస్ బేబీ జాన్ (వరుణ్ ధావన్).

అయితే.. తార (వామిక గబ్బి) రూపంలో ఓ ప్రమాదం వస్తుంది. ఆమె తీసుకొచ్చిన ఇబ్బందులను బేబీ జాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు బేబీ జాన్ ఈ మారుమూల గ్రామంలో ఎందుకు ఉంటున్నాడు? అతని గతం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రం.

Baby John Movie Review and Rating1

నటీనటుల పనితీరు: వరుణ్ ధావన్ ను నటుడిగా మాస్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసే పాత్ర బేబీ జాన్. యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది. అందువల్ల మాస్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బేబీ జాన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు.

కీర్తి సురేష్ రెగ్యులర్ హీరోయిన్ రోల్లో అలరించగా.. వామిక గబ్బి ఆశ్చర్యపరిచింది. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ & ఆమె ఆ పాత్ర కోసం పండించిన యాక్షన్ మంచి కిక్ ఇస్తాయి.

ఇక జాకీ ష్రాఫ్ తన సీనియారిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి ఒరిజినల్లో విలన్ కి ఇంత స్క్రీన్ స్పేస్ కానీ స్కోప్ కానీ ఉండదు. కానీ.. హిందీ వెర్షన్ విలన్ రోల్ బాగా పండింది.

ఇక రాజ్ పాల్ యాదవ్ కి ఇచ్చిన ఎలివేషన్ కూడా భలే వర్కవుట్ అయ్యింది. కామెడీ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్ అనే డైలాగ్ రాజ్ పాల్ కి సింక్ అయినట్లుగా ఎవరికీ సెట్ అవ్వదు.

Baby John Movie Review and Rating1

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కలీస్ & రైటర్స్ అట్లీ, సుమిత్ అరోరా కలిసి “తెరీ”ని మరీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయకుండా బాలీవుడ్ ఆడియన్స్ కి కావాల్సిన మసాలాలు యాడ్ చేసి, స్క్రీన్ ప్లే పరంగానూ కొద్దిపాటి మార్పులు చేసి తెరకెక్కించడం అనేది సినిమాకి ప్లస్ అయ్యింది. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూసిన ఆడియన్స్ కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా.. కథకు మెయిన్ ఎమోషన్ అయిన “అమ్మాయి మిస్సింగ్” ఎపిసోడ్ ను, మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్ గా డైరెక్టర్ & రైటర్స్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని తెలుగు సినిమాలు గుర్తుచేసినప్పటికి.. హీరోయిజంను చక్కగా ఎలివేట్ చేసింది. ర్యాప్ సాంగ్ మంచి ఎనర్జీ ఇచ్చింది.

రూబెన్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అలాగే.. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. అందువల్ల మంచి అవుట్ పుట్ వచ్చింది.

Baby John Movie Review and Rating1

విశ్లేషణ: సాధారణంగా రీమేక్స్ అంటే బోర్ కొట్టేస్తాయి. ఆల్రెడీ చూసిన సీన్స్ ని అటు తిప్పి ఇటు తిప్పి తీసేస్తుంటారు. కానీ.. “బేబీ జాన్” విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తపడడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదు. వరుణ్ ధావన్ ని స్టార్ లీగ్ లోకి తీసుకెళ్ళగలిగే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది.

Baby John Movie Review and Rating1

ఫోకస్ పాయింట్: వరుణ్ ధావన్ కి కలిసొచ్చిన మరో రీమేక్!

రేటింగ్: 3/5

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.