March 23, 202506:53:32 AM

సంధ్య థియేటర్ తెరవెనుక చరిత్ర.. ఎన్ని ఘట్టాలో..!

Sandhya theatre an iconic history at crossroads

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్న థియేటర్స్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ ఒకటి. 1980లో ప్రారంభమైన ఈ థియేటర్ హైదరాబాదీ ప్రేక్షకులకు ప్రత్యేక అనుబంధంగా నిలిచింది. మొదటగా హిందీ చిత్రం ‘షాలిమార్’ ప్రదర్శనతో ఆరంభమైన ఈ ప్రయాణం, బాలీవుడ్ సూపర్ హిట్ ‘షోలే’ ప్రదర్శనతో మరింత పటిష్టమైంది. అప్పటి నుంచి సంధ్య థియేటర్ కేవలం సినిమాలు చూసే స్థలంగా కాదు, స్టార్స్ సినిమాలకు సెంటిమెంట్‌గా మారింది.

Pushpa 2 The Rule

Sandhya theatre an iconic history at crossroads3

సంధ్య థియేటర్ తొలినాళ్లలో 1500 మంది ప్రేక్షకులను ఆహ్వానించగల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండేది. మారిన కాలంతో పాటు మోడర్నైజేషన్ జరుగుతుండటంతో అది 1323 సీట్లకు పరిమితమైంది. కానీ ప్రేక్షకుల ఉత్సాహానికి ఆ పరిమితులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రధానంగా స్టార్ హీరోల సినిమాలు ఈ థియేటర్‌లో విడుదల చేయడం ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పలు థియేటర్లున్నప్పటికీ సంధ్య థియేటర్‌కున్న ప్రత్యేకత కారణంగా నిర్మాతలు ఈ థియేటర్‌లో తమ సినిమాలను విడుదల చేయాలని కృషి చేసేవారు.

మల్టీప్లెక్స్ యుగం రాకముందు సంధ్య 70MM ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోలు కూడా తమ చిత్రాల విడుదలకు సంధ్యను ముఖ్యంగా ఎంపిక చేసేవారు. ఒకప్పుడు ఈ థియేటర్‌లో టికెట్ కోసం రోడ్డు వరకు లైన్లు కట్టేవారు. ఇది కేవలం సినిమా ప్రదర్శన స్థలమే కాదు, ప్రేక్షకుల ఊహలలో ఒక ఐకాన్‌గా మారింది. అయితే, ఇటీవల పుష్ప 2 (Pushpa 2 The Rule)  ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన ఈ చారిత్రాత్మక థియేటర్ భవిష్యత్తుపై మబ్బులు కమ్మింది.

Sandhya theatre an iconic history at crossroads2

రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన తర్వాత, పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పదిరోజుల్లో సరైన సమాధానం ఇవ్వకుంటే థియేటర్ మూతపడే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలు సినీ ప్రపంచానికే కాదు, థియేటర్ అభిమానులకు కూడా కలవరాన్ని కలిగిస్తున్నాయి.

మరో నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్.. కానీ..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.