సినిమా (Movies) పరిశ్రమకు శుక్రవారాలు, పండగ సీజన్లు చాలా ముఖ్యం. వాటిని వదులుకున్నాక బాధపడితే ఏమీ చేయలేం. అలాంటిది మన టాలీవుడ్ వరుసగా శుక్రవారాలు, లాంగ్ వీకెండ్‌లు వదిలేస్తోంది. ఇప్పుడు జనవరి మొదటివారాన్ని కూడా ఇలానే వదిలేసింది. ఇంకేముంది పాత సినిమాలు వచ్చి లైన్‌లో నిలుచున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత సినిమాలు రీరిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఒకప్పుడు జనవరి 1న ఏదో ఒక పెద్ద సినిమానో, చెప్పుకోదగ్గ చిన్న సినిమానో రిలీజు అయ్యేది.
Movies
కానీ సంక్రాంతికి వస్తే ఓ మోస్తరుగా ఉన్నా విజయం సాధించేయొచ్చు అని అనుకుని మొదటివారాన్ని వదిలేస్తున్నారు. అలా ఈ ఏడాది కూడా వదిలేశారు. దీంతో పాత సినిమాల్ని (Movies) మళ్లీ తెచ్చే కొంతమంది రెడీ అయిపోయారు. అలా నాలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. చిరంజీవి (Chiranjeevi) కంబ్యాక్ మూవీగా 1997లో వచ్చిన ‘హిట్లర్’ (Hitler) సినిమాను 28 సంవత్సరాల తర్వాత థియేటర్లకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో థియేటర్లలో మళ్లీ జనాలు చూస్తారు అని నమ్మకంగా చెబుతున్నారు.
మరోవైపు రాజమౌళి (S. S. Rajamouli) – నితిన్ (Nithin Kumar) ‘సై’ని (Sye) మరోసారి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికితోడు సిద్ధార్థ్ (Siddharth) ‘ఓయ్’ (Oye) సినిమాను రీ రీ రిలీజ్ చేస్తారట. ధనుష్ (Dhanush) మన తెలుగువాళ్లకు బాగా దగ్గరవ్వడానికి కారణమైన ‘రఘువరన్ బిటెక్’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా జనవరి 4న వస్తుందట. అయితే అసలు సమయానికి ఈ నాలుగు సినిమాల్లో ఏది నిలుస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే రీరిలీజ్ ఊపులో చాలా సినిమాలు (Movies) ప్రకటన వచ్చేసినా..
అసలు సమయానికి ఆ సినిమా అందుబాటులోకి రావడం లేదు. అయితే.. రీరిలీజ్‌లకు ఇలా లైన్ క్లియర్ చేయడం ఒక విధంగా మంచిదే అయినా.. థియేటర్లు దొరకడం లేదు అని బాధపడే చిన్న సినిమాల వాళ్లు ఇలాంటి డేట్స్‌ను టార్గెట్ చేసుకోవడం మంచిది అనే అభిప్రాయామూ వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా నిర్మాతలు ఈ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. లేదంటే రేపొద్దున మాకు థియేటర్లు దొరకడం లేదు అని అనకూడదు అనే వాదనా వినిపిస్తోంది.