March 25, 202510:41:31 AM

సూర్య, రవితేజ..ల సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన కోన వెంకట్!

Kona Venkat

కోలీవుడ్ దర్శకుడు ఆర్.జె.బాలాజీ (RJ Balaji)   తన నెక్స్ట్ సినిమాని సూర్యతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కథ గతంలో రవితేజ (Ravi Teja) హీరోగా రూపొందిన ‘వీర’ (Veera) అ సినిమాకి కాపీ అని ఇటీవల ప్రచారం గట్టిగా జరిగింది. వాస్తవానికి ‘వీర’ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. రమేష్ వర్మ (Ramesh Varma) ఆ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా గురించి మాట్లాడుకోవడానికి రవితేజ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అలాంటి సినిమా కథని దాదాపు 14 ఏళ్ళ తర్వాత సూర్య  (Suriya) చేయడం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు.

Kona Venkat

అయితే గతంలో సూర్య చేసిన కథతో రవితేజ కూడా ఓ సినిమా చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ విషయాన్ని రైటర్ కోన వెంకట్ Kona Venkat ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేశారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. “మేము ‘షాక్’ (Shock) అనే సినిమా చేశాం.రవితేజ, జ్యోతిక (Jyothika)… హీరో, హీరోయిన్స్. ఆ సినిమాలో హీరోయిన్ జ్యోతికని విలన్స్ చంపేస్తారు. అక్కడితో ఇంటర్వెల్. సెకండాఫ్..లో హీరో వాళ్లపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది ‘షాక్’ స్టోరీ. హీరోయిన్ చనిపోవడంతో ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది అక్కడితో..!

ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ ఎలా కలుసుకున్నారు? ఎలాంటి కలలు కన్నారు అనేది.. ఆడియన్స్ కి అనవసరం. అయితే సేమ్ కథతో ‘గజిని’ సినిమా వచ్చింది. అందులో కూడా హీరో, హీరోయిన్స్ ప్రేమించుకుంటారు. హీరోయిన్ ని విలన్స్ చంపేస్తారు. ఆ తర్వాత హీరో విలన్స్ పై రివేంజ్ తీర్చుకుంటాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. షాక్ ఎందుకు హిట్ అవ్వలేదు అంటే.. అది స్టోరీ టెల్లింగ్ అనే చెప్పాలి. ‘షాక్’ కథ స్ట్రైట్ గా ఉంటుంది. అందుకే ఆడియన్స్ కి ఆసక్తి కలగదు” అంటూ చెప్పుకొచ్చాడు.

‘పుష్ప 2’లో మిస్‌ అయిన కీలకమైన సీన్‌.. దాచారా? తీసేశారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.