March 24, 202509:13:10 AM

నేను సియంగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ హైక్ లు ఉండవు: రేవంత్ రెడ్డి!

No more benefit shows and ticket hikes in Telangana says CM Revanth Reddy (2)

సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఇష్యూ రోజురోజుకీ పెద్దదవుతోంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయమై గుర్రుమంటున్నాడు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో పుష్ప2 (Pushpa 2: The Rule) బెనిఫిట్ షో మేటర్ గురించి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. అల్లు అర్జున్ (Allu Arjun)  ఇంటికి సెలబ్రిటీలందరూ ఎందుకు క్యూ కట్టారు, ఆయనకి కాలు ఏమైనా విరిగిందా?, చనిపోయిన తల్లిని కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుర్రాడిని చూడడానికి ఎవరూ ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).

CM Revanth Reddy

No more benefit shows and ticket hikes in Telangana says CM Revanth Reddy (3)

ఇదే సమయంలో కాస్త ఘాటుగా స్పందిస్తూ.. “నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు తెలంగాణాలో బెనిఫిట్ షోలు కానీ టికెట్ హైక్ లు కానీ ఉండవని బల్ల గుద్ది మరీ చెప్పేసాడు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీకి మొన్నటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వంతో మాత్రమే ఇష్యూ అనుకుంటూ వచ్చారు. అక్కడ కూటమి ప్రభుత్వం రావడంతో సినిమా ఇండస్ట్రీ ఏకంగా పెద్ద పార్టీ చేసుకుంది. ఇక్కడ తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను అనడంతో.. ఇండస్ట్రీ వర్గాలన్నీ తెగ సంతోషపడ్డాయి.

అయితే.. థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కారణంగా, లా & ఆర్డర్ సమస్య తలెత్తడం, అల్లు అర్జున్ అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీలో చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించడం, అల్లు అర్జున్ తన పరామర్శ ప్రక్రియను ఏకంగా రెండు రోజులపాటు కొనసాగించడమే కాక, దాన్ని లైవ్ స్ట్రీమ్ చేయడం అనేది తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కాస్త గట్టిగా ఫీల్ అయ్యేలా చేసింది. ఇవాళ అసెంబ్లీలో జరిగిన రచ్చ అంతా దాని పర్యవసానమే. ఇప్పుడు “పుష్ప 2” రచ్చ పుణ్యమా అని, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం హయాంలో విడుదలయ్యే ఏ ఒక్క సినిమా కూడా హయ్యస్ట్ డే1 కలెక్షన్స్ అనేది సాధించలేదు.

No more benefit shows and ticket hikes in Telangana says CM Revanth Reddy (4)

ఎందుకంటే.. నైజాం ఏరియా హయ్యస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టే జోన్. మరి ఈ విషయమై సినీ పెద్దలు, మరీ ముఖ్యంగా దిల్ రాజు ఏమైనా బుజ్జగింపు చర్యలు చేపడతాడేమో చూడాలి. ఎందుకంటే.. సంక్రాంతికి విడుదలయ్యే “గేమ్ ఛేంజర్ (Game Changer) , డాకూ మహరాజ్ (Daaku Maharaaj) , సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunnam) సినిమాల్లో రెండిటికి దిల్ రాజు  (Dil Raju)  నిర్మాత కాగా, మరో చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు.

చరణ్ కోసం పవర్ స్టార్.. అభిమానులకు కిక్కిచ్చేలా!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.