సీనియర్ స్టార్ హీరోలతో ఎలాంటి కథ బాగుంటుంది, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది అని చెప్పడం కొంతమంది దర్శకులు మాస్టర్స్ చేసి ఉంటారు. వారితో సినిమాలు చేస్తే ఆ స్టార్లకు విజయాలు పక్కా అని అంటుంటారు. అలాంటి దర్శకుల్లో కేఎస్ రవీంద్ర (బాబీ) (Bobby) ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో పడ్డ పెద్ద ఇబ్బందిని ఇటీవల చెప్పుకొచ్చారు.
Bobby
నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ‘డాకు మహరాజ్’ (Daaku Maharaaj) అనే సినిమా చేసిన బాబీ.. సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గరకు వస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో (Waltair Veerayya) వచ్చి భారీ విజయం అందుకున్న బాబీ.. మరోసారి సంక్రాంతికి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న ఆయన.. రీసెంట్‌గా చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దానికి కారణం ఆయన ఆ సినిమా ఏంటో చెప్పకపోవడమే. గతంలో తాను తీసిన ఒక సినిమా విషయంలో ప్రొడక్షన్ హౌస్‌తో ఇబ్బందులు పడ్డానని చెప్పిన బాబీ..
ఆ సినిమా పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. అంతేకాదు ఆ సినిమా హిట్ అయినప్పటికీ.. ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సిన సినిమా అని చెప్పారు. సినిమాకు తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి, ఇంకా గ్రాండ్‌గా తీసే అవకాశం ఇచ్చి ఉంటే సినిమా రేంజే వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఏ సినిమా గురించి అలా మాట్లాడారు అనే చర్చ మొదలైంది. బాబీ ఫిల్మోగ్రఫీ చూస్తే.. ఫ్లాప్ అయిన సినిమా ఒక్కటే. అదే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) . ఇక విజయం సాధించినా, సరైన వసూళ్లు అందుకోని సినిమా ‘జై లవకుశ’ (Jai Lava Kusa) ఒక్కటే.
‘వాల్తేరు వీరయ్య’, ‘పవర్’ (Power) ఎలాగూ మంచి వసూళ్లు అందుకున్నాయి. ఈ లెక్కల బట్టి బాబీ చెప్పిన ఆ ఇబ్బందులు పడ్డ సినిమా ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అయితే ఆ ఇబ్బందులు ఏంటి, ఎందుకు పడ్డాడు అనేది ఆయనే చెప్పాలి.అన్నట్లు ‘జై లవకుశ’ సినిమా నిర్మాణ సంస్థ.. ‘దేవర’ నిర్మాణ సంస్థ ఒక్కటే. ‘దేవర’ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో అభిమానులే పెదవి విరిచారు. ఆ లెక్కన ‘జై లవకుశ’ సినిమాకి బాబీ (Bobby) ఇలాంటి ఇబ్బంది పడి ఉండొచ్చు అనే వాదనా వినిపిస్తోంది.