March 26, 202508:24:21 AM

Chiranjeevi: విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ హుటాహుటిన బన్నీ ఇంటికెళ్లిన చిరంజీవి!

సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ (Allu Arjun)  అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ కి వెళ్లడం, అక్కడ తొక్కిసలాట సంభవించడం.. ఈ క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. దీంతో పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది అంటూ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.

Chiranjeevi

అలాగే సరైన సమాచారం ఇవ్వకుండా పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేస్ కి వచ్చి అల్లు అర్జున్ ని తీసుకొచ్చినందుకు అతని టీం పై, అలాగే వెళ్లినందుకు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆ కారణంతో ఈరోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోపక్క అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న టాలీవుడ్ పెద్దలు ఒక్కొక్కరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు. దిల్ రాజు ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అల్లు అర్జున్, అరవింద్ (Allu Aravind) ..లని కలిసి ధైర్యం చెప్పి వచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. అయితే పోలీసులు ఆయన్ని లోపలి అనుమతించలేదు. దీంతో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఫ్యామిలీకి ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది. ‘విశ్వంభర’  (Vishwambhara)   షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ అల్లు అర్జున్ కోసం చిరు వెళ్లడం అనేది ఆయన ఉన్నత స్థానాన్ని, హుందాతనాన్ని గుర్తుచేస్తుంది. అలాగే కష్టకాలంలో అల్లు కుటుంబానికి అండగా నిలబడేందుకు చిరు సిద్దమవ్వడంపై అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.