March 22, 202504:39:08 AM

Chiranjeevi: మెగాస్టార్ పవర్ఫుల్ లైనప్.. మొత్తం యువ దర్శకులే..!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినీ ప్రస్థానంలో మరో న్యూ ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నారు. రీసెంట్‌గా చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో బాక్సాఫీస్‌ హవా చూపించిన చిరు, ఈ సారి యువతరం దర్శకులతో కొత్త ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సీనియర్ మేకర్స్‌తో ఎన్నో విజయవంతమైన ప్రాజెక్ట్స్ చేసిన చిరు, ఇప్పుడు టాలీవుడ్ యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా ముందుకెళుతున్నారు. ప్రస్తుతం వశిష్ట (Mallidi Vasishta) దర్శకత్వంలో రూపొందుతున్న “విశ్వంభర” (Vishwambhara) చిత్రంతో చిరు బిజీగా ఉన్నారు.

Chiranjeevi

ఇది యాక్షన్-ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని, భారీ విజువల్స్, ఆధ్యాత్మిక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీజర్‌ ద్వారా అర్థమైంది. బింబిసార (Bimbisara) సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, ఈ ప్రాజెక్ట్‌ను అత్యధిక అంచనాలతో రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా చిరు కెరీర్‌లో మరో బిగ్ రికార్డ్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక కామెడీ యాక్షన్ సినిమాల మేకర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఖరారైంది.

చిరు, అనిల్ కాంబినేషన్ భారీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. “భగవంత్ కేసరి (Bhagavanth Kesari)” “సరిలేరు నీకెవ్వరు” (Sarileru Neekevvaru) వంటి విజయాల తర్వాత అనిల్ కంటెంట్ రిచ్ స్క్రిప్ట్‌తో మెగాస్టార్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అలాగే దసరా (Dasara) సినిమాతో డైరెక్టర్‌గా తన ప్రతిభను చూపించిన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) , మెగాస్టార్‌తో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. మాస్ ఎమోషన్లతో బలమైన కథలను చెప్పడంలో నిపుణుడైన శ్రీకాంత్, చిరంజీవిని కొత్తగా చూపించేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ SLV సినిమాస్ – యూనానిమస్ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనుంది. అదేవిధంగా, వెంకీ కుడుముల (Venky Kudumula), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వంటి డైరెక్టర్లు కూడా మెగాస్టార్‌తో సినిమాలకు సిద్ధమవుతున్నారు. చిరు ఈ సారి కొత్త కథాంశాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలని భావిస్తున్నారు. యువతర దర్శకుల కొత్త ఆలోచనలు చిరు స్టార్డమ్‌తో కలిస్తే, తెలుగు సినీ పరిశ్రమలో మరో క్రేజీ లైనప్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

పుష్ప 2: అసలు నార్త్ రివ్యూలు ఎలా ఉన్నాయి?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.